బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఎన్నికల సంఘం (ECI) నకిలీ లేదా డుప్లికేట్ ఓటర్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జన్‌సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌కు(Prashant Kishor) నోటీసులు జారీ చేసింది. ఆయన పేరుతో రెండు రాష్ట్రాల్లో – బీహార్ మరియు పశ్చిమ బెంగాల్‌లో – ఓటర్ ఐడీలు ఉన్నాయని ఈసీ గుర్తించింది.
Read also: Fake news: వాట్సాప్ కాల్స్‌పై రూమర్లు ఫేక్ అని స్పష్టం చేసిన హైదరాబాద్ పోలీసులు!

ఎన్నికల అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రశాంత్ కిషోర్‌కి(Prashant Kishor) పశ్చిమ బెంగాల్‌లోని కాళీఘాట్ రోడ్‌లో ఓటర్ ఐడీ ఉంది, ఇది టీఎంసీ పార్టీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన చిరునామా. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ సమయంలో కిషోర్ టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. అదేవిధంగా, ఆయన స్వస్థలం అయిన బీహార్‌లోని కార్గహర్ నియోజకవర్గంలో కూడా మరో ఓటర్ ఐడీ నమోదు అయిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం
ఈసీ తన నోటీసులో ప్రశాంత్ కిషోర్‌ను మూడు రోజుల్లోపు స్పందించమని ఆదేశించింది. రెండు చోట్ల ఓటర్ నమోదు చట్టపరంగా తప్పు కింద పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. ఆయన వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈసీ ప్రకారం, ఒక వ్యక్తి ఒక్క నియోజకవర్గంలో మాత్రమే ఓటర్‌గా నమోదు కావాలి.
జన్‌సూరాజ్ పార్టీ కౌంటర్ – “ఇది ఈసీ తప్పిదం”
ఈ నోటీసులపై జన్‌సూరాజ్ పార్టీ ప్రతినిధి కుమార్ సౌరభ్ సింగ్ స్పందిస్తూ, ఇది ఈసీ సాంకేతిక తప్పిదమని పేర్కొన్నారు. “ఓటర్ కార్డులు జారీ చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. కిషోర్ వంటి ప్రముఖులకు ఈ పొరపాట్లు చేస్తే, సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి,” అని అన్నారు. పార్టీ ప్రకారం, కిషోర్‌పై రాజకీయ కారణాల వల్లే ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: