📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Prajwal Revanna: ఎంపీ అత్యాచార కేసులో కీలకంగా మారిన చీర

Author Icon By Sharanya
Updated: August 7, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తప్పులు చేసే నిందితులు ఎన్నివిధాలుగా తప్పించుకోవాలని చూసినా ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. పోలీసులకంటే నేరస్తులకే తెలివితేటలు ఎక్కువని భ్రమిస్తారు. కానీ అన్యాయం ఏదోఒకవిధంగా పట్టుబడేలా చేస్తుంది. పదవి, డబ్బు, రాజకీయ అండదండలతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) విషయంలో ఇదే జరిగింది. కర్ణాటక (Karnataka) లో పెనుసంచలనం సృష్టించిన జెడిఎస్ మాజీ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను లైంగిక కేసులో దోషిగా స్పెషల్ కోర్టు నిర్ధారించింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు ఈ తీర్పు ఒక భారీ షాక్ గా మారింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పుకు ఓ చీర కీలక సాక్ష్యంగా మారిందని దర్యాప్తు అధికారులు తెలిపారు.

Prajwal Revanna

వీర్యం ఆనవాళ్లతో నిర్ధారించిన నిపుణులు

గత ఏడాది ఏప్రిల్లో ప్రజ్వలేవణ్ణ ఇంట్లో మహిళా పనిమనిషి తనపై జరిగిన లైంగిక వేధింనుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 నుంచి ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) తనపై పదేపదే అత్యాచారం చేశారని, ఈ ఘటన వీడియోలు తీసి ఎవరికైనా చెబితే బయటపెడతానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. అయితే, కేసు దర్యాప్తులో పోలీసులకు ఈ నేరాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలు అవసరమయ్యాయి. ఈ సమయంలో బాధితురాలు తాను దాచిపెట్టిన ఒక చీరను పోలీసులకు అందించింది. ఈ చీరను ఫోరెన్సిక్ పరీక్షలకు (Forensic examinations) పంపగా, దానిపై వీర్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు.

టెక్నికల్ ఆధారాలను రుజువు చేసిన చీర

ఈ ఫోరెన్సిక్ నివేదిక ప్రజ్వల్ నేరాన్ని నిరూపించడంలో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితురాలు చెప్పిన ఘటనలకు, టెక్నికల్ ఆధారాలను ఈ చీర రుజువు చేసింది. అంతేకాకుండా, బాధితురాలు చెప్పిన స్టేట్మెంట్ గురించి ఈ సాక్ష్యం బలోపేతం చేసింది. ప్రత్యేక కోర్టు విచారణ సమయంలో 23మంది సాక్షులను ప్రశ్నించింది. పోలీసులు సేకరించిన వీడియో క్లిప్లు, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఈ చీరను కూడా కోర్టులో సమర్పించారు. దీంతో కోర్టు ప్రజ్వలు యావజ్జీవకాగార శిక్షను విధించింది. ఈ తీర్పు ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీసింది. ఈ ఘటన దేశంలో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసే నేరాలపై న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తుందని మరోసారి నిరూపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/vice-president-election-notification-released/national/527297/

Breaking News Forensic Investigation Karnataka politics latest news MP Crime Prajwal Revanna Rape case Saree Evidence sexual assault case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.