పేద కుటుంబాల్లోని మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (Pradhanmantri UjjwalaYojana) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, స్టౌవ్ మరియు మొదటి సిలిండర్ అందిస్తున్నారు.
Read Also: Rahul Gandhi: నేను నరవణేను నమ్ముతున్నాను.. రాహుల్ గాంధీ
ప్రతి సిలిండర్‌పై ₹300 సబ్సిడీ
ఈ పథకం కింద(Pradhanmantri UjjwalaYojana) ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు రాయితీ లభిస్తుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్ల వరకు సబ్సిడీ వర్తిస్తుంది.
అర్హత ప్రమాణాలు
ఈ పథకం పొందేందుకు కొన్ని అర్హతలు ఉన్నాయి:
- మహిళ వయస్సు 18 సంవత్సరాలు నిండివుండాలి
- కుటుంబంలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు
- ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి లోపు కుటుంబం ఉండాలి
ఈ పథకం ద్వారా కట్టెల పొయ్యిల వల్ల కలిగే పొగ సమస్య తగ్గి, మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: