సైబర్ నేరగాళ్లు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. తాజాగా ‘భారత పోస్టాఫీస్(PostOffice Scam) చఠ్‌పూజ సబ్సిడీ రూ.20,000’ లేదా ‘లక్కీ డ్రా రివార్డు’ పేరుతో ఒక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతోంది. ఈ మెసేజ్‌లోని లింకులు ప్రజలను ఆకర్షించి నకిలీ వెబ్‌సైట్లకు దారి తీస్తున్నాయని అధికారులు హెచ్చరించారు.
Read also: Shreyas Iyer Health Update : శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం ఎలా ఉందంటే..!!
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ పోస్టును పరిశీలించి, ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. చఠ్‌పూజ సందర్భంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి సబ్సిడీ లేదా లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రకటించలేదని పేర్కొంది.
నకిలీ వెబ్‌సైట్లు – వ్యక్తిగత వివరాల దోపిడీ
PIB ప్రకారం, ఈ ఫేక్ లింకులు ప్రభుత్వ వెబ్‌సైట్ల మాదిరిగా కనిపించినా, అవి మోసపూరితమైనవి. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని — బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ATM పిన్, ఓటీపీ, ఆధార్ వివరాలు — సేకరించే ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఇలాంటి సందేశాలకు బలవ్వకూడదని, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు సబ్సిడీలు లేదా నగదు బహుమతులు ఈ విధంగా సోషల్ మీడియా లింకుల ద్వారా ఇవ్వవని PIB స్పష్టం చేసింది.
ఫేక్ మెసేజ్‌లను ఎలా చెక్ చేయాలి – PIB సూచనలు
PostOffice Scam: ఏదైనా అనుమానాస్పద మెసేజ్, లింక్ లేదా ఫోటో వచ్చినప్పుడు దాని నిజానిజాలు తెలుసుకోవాలంటే PIB Fact Check WhatsApp నంబర్ +91 8799711259కు పంపవచ్చు.
అలాగే X (Twitter) అకౌంట్ @PIBFactCheck ద్వారా కూడా సమాచారాన్ని పంపి ధృవీకరించుకోవచ్చు. ప్రజల భద్రతే ముఖ్యమని, అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ప్రభుత్వం ధృవీకరించిన సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారానే సమాచారం పొందాలని అధికారులు సూచించారు.
పోస్టాఫీస్ చఠ్‌పూజ సబ్సిడీ నిజమా?
కాదు, అది పూర్తిగా ఫేక్. పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి సబ్సిడీని ప్రకటించలేదు.
ఈ లింక్‌లను క్లిక్ చేస్తే ఏమవుతుంది?
మీ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: