📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Ponnam Prabhakar: ఉపాధి నిర్వీర్యం చేయకుండా పోరాడుదాం

Author Icon By Saritha
Updated: December 29, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : (Ponnam Prabhakar) ఉపాధి హామి పథకం నిర్వీర్యం చేయకుండా కేంద్రంపై పోరాటం చేద్దామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రధాకర్ పిలపు నిచ్చారు. ఆదివారం గాంధీభవన్లో మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ కలిసి విలేఖరులతో మాట్లాడుతూ 2004లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆనాడు అనేక మంది మేధావులతో సంప్రదించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పెంచడానికి మహాత్మా గాంధీ(Mahatma Gandhi) ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ప్రజలు తిండి లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఉండకుండా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. గ్రామాలలో పనిలేని రోజుల వందరోజులు పని కల్పించడంతో ప్రజల ఆర్థిక వ్యవస్థ రూపు మారిందని చెప్పారు. 2014 ఎన్నికల ఎజెండాలో బిజెపి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా. పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పిందని, దానిని విస్తరించకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహ రిస్తోందని అన్నారు.

Read also:  Telangana: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని ఆవేదన

మళ్ళీగ్రామీణులు వలసలు మొదలైనా, ఆకలిచావులు మొదలైనా దీనికి పూర్తిగా బిజెపి కేంద్రప్రభుత్వం ఐధ్యత వహించాలని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలో రాష్ట్రాల పై భారం మోపేలా 60:40 శాతం నిధులు ఉండేలా చేస్తుందని ఇప్పటికే రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని ఆయన ఆవేదన చెందారు. (Ponnam Prabhakar) మహాత్మా గాంధీ తొలగించి జీరాంజీ పేరు పెట్టాడంలొనే కుట్ర దాగుందని అన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ల పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని బిజెపి మోడీ సర్కార్ చేస్తుందని ఆయన అన్నారు. దానికి నిరసనగా ప్రతి గ్రామంలో గాంధీ ఫోటో లతో ప్రతి ఒక్కరు నిరసనలు తెలపాలనీ కోరారు. తెలంగాణలోని అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానం చేయాలని ఆ తీర్మానం కాపీని మోదీ కి పంపించాలని పిలుపునిచ్చారు. దీనికి అధికారులు సహకరించాలనీ సూచించారు.. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేలా చేసిన ఈ బిల్లు పై వెనక్కి తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమంలో స్వాతంత్ర్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిందని 141 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్నారు.

మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ విమర్శలు

దేశ అభివృద్ధి లో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందనీ అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, యుపిఎ ప్రభుత్వాలు చేసిన సంస్కరణలతోనే ప్రపంచంలో భారత్ ముందుందని అన్నారు. నెహ్రూ నుంచి మొదలు కొని మన్మోహన్ వరకు కాంగ్రెస్ ప్రధానులు తీసుకొన్న అనే సాహసోపేతమై విధానాల కారణంగానే దేశాభివృద్ధి జరుగుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, పథకాలు తీసుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్, సివి నరసింహారావు దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని కొనియాదారు. ఉపాధి హామీ పధరంక ఉన్న మహాత్మా గాంధీ పేరు తొలగించడం కుట్ర పూరితమైన నిర్ణయమని ఆరోపించార, రాష్ట్రాన్ని చెప్పుడేతల్లో పెట్టుకోవడానికి కేంద్రం మన రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఎస్ఆర్ఆఎం పరిమితిని పెంచడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కు 90 శాతం నిధులు కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ నాయకత్వంలో అన్ని ఎన్నికలు ఓడిపోయారని కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రపందం గాంధీని కొనియాడుతోందని కేవలం బిజెపి మాత్రమే గాంధీనితిరస్కరిస్తుందని మంత్రి అజారుద్దీన్ అన్నారు. బిఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాల్లో మాత్రేమే బ్రతికి ఉందని ప్రజల్లో లేదని అన్నారు.


Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Central Government Policies congress party Gandhi Name Removal Latest News in Telugu Rural Employment Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.