మలేషియాలో ఓ పోలీస్ హెలికాప్టర్ (Police helicopter) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన జోహోర్ రాష్ట్రంలోని పులాయ్ నదిలో మాక్ డ్రిల్ (Mock drill in Pulai River) సమయంలో జరిగింది. మలేషియా పౌర విమానయాన శాఖ ప్రకారం, ఇది యుద్ధ విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన ప్రాక్టీస్ కార్యక్రమంలో భాగమే. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ల మధ్య జరుగుతున్న ‘మిత్సతోమ్ 2025’ అనే అణు భద్రతా బహుళ జాతీయ వ్యాయామంలో ఈ డ్రిల్ భాగంగా ఉంది.
టేకాఫ్ తర్వాతే నదిలో కుప్పకూలిన హెలికాప్టర్
తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన మలేషియా ఎయిర్ బస్ ఏఎస్ 355 ఎన్ హెలికాప్టర్ కొద్ది సమయం తర్వాత గెలాంగ్ పటా వద్ద మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (ఎంఎంఈఏ) జెట్టీ సమీపంలోకి వచ్చేసరికి అకస్మాత్తుగా అదుపు తప్పింది. వెంటనే అది నదిలోకి కూలిపోయింది.ప్రమాదం జరిగిన వెంటనే సహాయ బృందాలు యాక్టివ్ అయ్యాయి. హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురిని, పైలట్‌తో పాటు కాపాడారు. అయితే వారిలో ఇద్దరు తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మిగిలినవారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ప్రమాదం దృశ్యాలు వైరల్
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా పంచుకుంటున్నారు. హెలికాప్టర్ నదిలో కూలుతున్న క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై మలేషియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హెలికాప్టర్ ఎందుకు కూలిందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also : TV Rama Rao : రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!