📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PMKisan 22nd Installment: అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

Author Icon By Pooja
Updated: February 18, 2026 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PMKisan 22nd Installment: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద 22వ విడత నగదు సహాయాన్ని ఫిబ్రవరి చివరి వారంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విడతలో అర్హత కలిగిన రైతులకు రూ.2,000 నేరుగా డీబీటీ విధానంలో పంపనుంది. ఇప్పటికే 21 విడతల వరకు నగదు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, 22వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుందని సమాచారం.

Read Also: River india stops : షాపుర్‌కండి బ్యారేజీ పూర్తి కావడంతో రావి నీటిని నిలిపే భారత్ నిర్ణయం

PM Kisan 2nd Installment: Money in the account.. when?

గత విడతల ట్రెండ్ ప్రకారం ఈ నెలాఖరులోనే చెల్లింపులు

గత సంవత్సరాల్లో విడుదలైన తేదీలను పరిశీలిస్తే, పీఎం కిసాన్ నగదు సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేసిన ఉదాహరణలు ఉన్నాయి. 19వ విడత ఫిబ్రవరి 24న, 16వ విడత ఫిబ్రవరి 28న, 13వ విడత ఫిబ్రవరి 27న జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఆధారంగా ఈసారి కూడా ఫిబ్రవరి చివర్లోనే 22వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా.

e-KYC తప్పనిసరి – లేకపోతే డబ్బులు రావు

పీఎం కిసాన్ నగదు పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. e-KYC పెండింగ్‌లో ఉంటే ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావని అధికారులు తెలిపారు. అందువల్ల లబ్దిదారులందరూ వెంటనే తమ KYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

మీకు డబ్బులు వస్తాయా? లేదో ఎలా చెక్ చేయాలి

రైతులు తమ అర్హతను సులభంగా తెలుసుకోవచ్చు.

అలాగే PM Kisan వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో “Know Your Status” ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి 22వ విడత స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతీ విడతకు ముందు లబ్దిదారుల జాబితాను ప్రభుత్వం నవీకరిస్తూ ఉంటుంది. అర్హత లేని రైతులను జాబితా నుంచి తొలగిస్తుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu PMKisan PMKisanNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.