దేశవ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, క్యాబ్ డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, గృహ సహాయకుల ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పీఎం–స్వానిధి(PM-SVANidhi) మోడల్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా ప్రతి అర్హుడికి రూ.10 వేల మేర స్వల్ప రుణం అందించనుంది.
Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకాన్ని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుని యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కలిగి ఉన్న కార్మికులు మాత్రమే ఈ రుణానికి అర్హులు అవుతారు. రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించిన వారికి, భవిష్యత్తులో రూ.50 వేల వరకు అదనపు రుణం పొందే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: