📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: PM Narendra Modi – ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

Author Icon By Anusha
Updated: September 21, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేపటి నుంచి,కొత్త జీఎస్టీ (GST) రేట్లు అమలులోకి రానున్నాయి.కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో, ఈ కొత్త రేట్ల పరిష్కారం కోసం సరైన సమయాన్ని ఎంచుకుని, జాతీయ ప్రసంగం ద్వారా సమగ్ర సమాచారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ (PM Narendra Modi) ఈరోజు సాయంత్రం 5 గంటలకు సామాన్య ప్రజలకు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం దేశ వ్యాప్తంగా పలు మీడియా వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ప్రధాని మోదీ ప్రసంగం దేని గురించి ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే కొత్త జీఎస్టీ రేట్ల (GST rates) గురించి ఆయన మాట్లాడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచి కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కొత్త రేట్ల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది.ఇటీవలే జీఎస్టీలో కేంద్రం కీలక సంస్కరణలు తీసుకొచ్చింది.

PM Narendra Modi

సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది

ఇకపై 5, 18, 40 శాతం పన్ను స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. 200పైగా వస్తువులపై పన్ను తగ్గించి, మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం ఊరట కల్పించింది. గతంలో 12 శాతం స్లాబ్‌ (Slab) లోని 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వస్తాయి. 28 శాతం స్లాబ్‌లోని 90 శాతం వస్తువులు 18 శాతంలోకి రాబోతున్నాయి. దసరా, దీపావళి ముందు పన్ను రేట్లు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేయబోయే ప్రసంగంలో ఏయే అంశాలు ఉంటాయనేది కీలకంగా మారింది.అంతేకాకుండా ఇటీవల గుజరాత్ పర్యటన (Tour of Gujarat) లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాలపై ఆధారపడటం మన నిజమైన శత్రువు అని పేర్కొన్నారు. ఈ అంశంతో పాటు ట్రంప్ (Donald Trump) విధించిన 50శాతం టారీఫ్స్, కొత్త హెచ్1-బీ వీసా ఫీజుల గురించి కూడా ఆయన ప్రస్తావించవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల గురించి కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ఏడాది నవరాత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/smriti-mandhana-smriti-mandhana-creates-history-in-odis/sports/551411/

Breaking News consumer benefit government announcement GST rates India economy latest news Narendra Modi speech new GST price reduction Tax Reforms tax update Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.