📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

నేడు కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని

Author Icon By sumalatha chinthakayala
Updated: February 5, 2025 • 7:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రయాగరాజ్‌: ప్రధాని మోడీ ఈరోజు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం 10గంటలకు ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్ ఘాట్ కు వెళ్తారు.

ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఢిల్లీ బయలుదేరివెళ్తారు. ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ ప్రధాని మోడీ పాల్గొనరని సమాచారం. మోడీ వస్తున్న నేపథ్యంలో నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్ తోపాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

ఇప్పటి వరకు 38కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతోపాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు.
కాగా, మహా కుంభమేళా ప్రారంభం కాకముందే వివిధ కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ ప్రయాగ్‌రాజ్‌ వెళ్లారు. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

CM Yogi Adityanath Google news Maha Kumbh Mela PM Modi Prayagraj Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.