📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu News: NDA: ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తాం: ప్రధాని మోదీ

Author Icon By Vanipushpa
Updated: October 24, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్ నాయకత్వంలో ఎన్​డీఏ కూటమి రాష్ట్రంలోని అన్ని ఎన్నికల రికార్డ్​ను బ్రేక్ చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని బెయిల్​పై బయటకు వచ్చిన వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని తిరుగుతున్న నేతలే దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేల కోట్ల స్కామ్‌లు చేసి బెయిల్‌పై బయట తిరుగుతున్న ఆర్‌జేడీ, కాంగ్రెస్ నేతలు కూడా భారతరత్న కర్పూరీ ఠాకూర్ లాంటి మహనీయుడి బిరుదును పొందాలని తాపత్రయ పడుతున్నారని మోదీ విమర్శించారు. శుక్రవారం బిహార్‌లోని సమస్తీపూర్‌లోని జరిగిన ఎన్‌డీఏ కూటమి ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Afghanistan: పాక్ కు నీళ్లు బంద్ చేయనున్న ఆఫ్ఘనిస్థాన్

ఆర్‌జేడీ పార్టీ లాంతరు గుర్తుపై మోదీ సెటైర్స్

ఈ సందర్భంగా బహిరంగ సభకు హాజరైన ప్రజలను వారివారి ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేయమని ప్రధానమంత్రి కోరారు. దీంతో అందరూ ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేసి చూపించారు. ప్రజలందరి చేతుల్లోకి ఆధునిక గాడ్జెట్లు వచ్చినందున, ఇక లాంతర్లు అక్కర్లేదని మోదీ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్‌జేడీ పార్టీ లాంతరు గుర్తుపై సెటైర్స్ వేశారు. ‘2005 అక్టోబరులో జంగిల్ రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి లభించింది. నీతీశ్ కుమార్ సారథ్యంలో రాష్ట్రంలో ఎన్‌డీఏ సర్కారు ఏర్పాటైంది. ఆ సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ – ఆర్‌జేడీ కూటమి పాలన ఉండేది.

కాంగ్రెస్‌ను ఆర్‌జేడీ బ్లాక్ మెయిల్: మోదీ

నీతీశ్‌ కుమార్‌కు అనుకూలంగా ఓట్లు వేశారనే అక్కసుతో, నాటి కేంద్ర సర్కారులో ఉన్న ఆర్‌జేడీ పార్టీ బిహారీలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. బిహార్‌లోని నీతీశ్ కుమార్ సర్కారుకు ఏదైనా సాయం చేస్తే, కేంద్ర సర్కారుకు మద్దతును ఉపసంహరించుకుంటాం అని చెబుతూ కాంగ్రెస్‌ను కూడా ఆర్‌జేడీ బ్లాక్ మెయిల్ చేసింది’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘మేం గత 11 ఏళ్లలో బిహార్‌కు ఆర్థిక సహాయాన్ని, బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాం. ప్రస్తుతం రాష్ట్రంలో పండే మఖానా విదేశాలకు ఎగుమతి అవుతోంది. బిహార్‌కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BJP campaign election 2025 Election records India News Indian Politics Latest News Breaking News Narendra Modi PM Modi Political Speech Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.