हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన

Anusha
గిర్‌ అభయారణ్యంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ రోజు, మార్చి 3, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గిర్ అడవుల్లోని ఆసియా సింహాలను వీక్షించారు. తనకున్న ప్రత్యేకమైన ఆసక్తితో ప్రధాని స్వయంగా కెమెరాతో ఫోటోలు తీశారు. ఆయన ఫోటోగ్రాఫీ పట్ల ఆసక్తి చాలా మందికి తెలిసిందే.

వన్యప్రాణి దినోత్సం

ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొంటారు.

వైల్డ్‌ లైప్ హెల్త్‌ 

ఈ పర్యటన అనంతరం జునాగఢ్‌లోని ససాన్ ప్రాంతంలో న్యూ పిపాలియా వద్ద . ఈ సందర్భంగా 20.24 హెక్టార్లలో నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ హెల్త్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణకు కీలకమైన ముందడుగు అని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అభయారణ్య పర్యటన

గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాల్లో 53 తాలుకాల్లో దాదాపు 30 చదరపు కిలోమీటర్లలో ఆసియా సింహాల ఆవాసాలు ఉన్నాయి. అందుకే గుజరాత్‌ను ఆసియా సింహాల భూమిగా పిలుస్తారు. దీన్ని ఆసియా సింహాల నేలగా కూడా పిలుస్తారు.గిర్ అభయారణ్యం ప్రపంచంలో ఆసియా సింహాల కోసం ఉన్న ఏకైక అభయారణ్యం. వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల్లో ఈ నూతన హెల్త్ సెంటర్ ప్రధాన పాత్ర పోషించనుంది.

lion

ఫోటోగ్రాఫీపై ప్రత్యేక ఆసక్తి

ప్రధాని మోదీకి వన్యప్రాణుల ఫోటోగ్రాఫీ అంటే ఇష్టం. గతంలో కూడా ఆయన పలు వన్యప్రాణి అభయారణ్యాలను సందర్శించి ఫోటోలు తీశారు. ఈసారి గిర్ అడవుల్లో సింహాలను దగ్గరగా చూశారు, వారి జాబితా, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆయన తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పరిమల్ నత్వానీ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ గిర్‌ అభయారణ్య పర్యటన సందర్భంగా రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. భారతదేశ సింహం, గుజరాత్‌గర్వించదగ్గ కుమారుడు, ప్రధాని మోదీ ఆసియా సింహాల భూమిని సందర్శిస్తున్నారని రాసుకొచ్చారు.

మరిన్ని చర్యలు

ఈ సందర్శనతో వన్యప్రాణుల సంరక్షణపై మరింత దృష్టి పెడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వన్యప్రాణుల ప్రేమికులు కూడా ఈ చర్యలు మరింత విస్తృతంగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే సందర్భంగా ఈ సందర్శనం వన్యప్రాణి పరిరక్షణకు ప్రాధాన్యత పెంచేలా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870