PM Modi viral photo child : మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. తన అధికారిక నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఒక చిన్నారితో ఆప్యాయంగా ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో ఆ బాలుడు ఎవరు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. “ఒక చిన్న స్నేహితుడితో” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షల లైకులు వచ్చాయి.
Read Also:Peddi movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్

ఈ ఫొటోలో కనిపించిన చిన్నారి మరెవరో కాదు, కేరళకు చెందిన నటుడు, బీజేపీ నేత Krishna Kumar మనవడు నీయోమ్ అశ్విన్ కృష్ణ. “ఓమీ” అని ముద్దుగా పిలిచే ఈ బాలుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దియా కృష్ణ, అశ్విన్ దంపతుల కుమారుడు. ఇటీవల కృష్ణకుమార్ కుటుంబం ప్రధానిని కలిసిన సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: