📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నమీబియా పార్లమెంట్​(Namibiai Parliment)లో చేసిన ప్రసంగం ఓ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కృతం చేసింది. నమీబియా పార్లమెంట్​లో మోదీ చేసిన ప్రసంగం గత 11 ఏళ్లలో ప్రధాని హోదాలో 17వది కావడం విశేషం. ఇది స్వతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన ప్రసంగాలతో సమానం కావడం గమనార్హం. ఈ నెల మొదటి వారం పార్లమెంట్​లో ఇచ్చిన తాజా ప్రసంగాలతో మోదీ ఈ ఘనతను సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్​లలో అత్యధికంగా ఏడుసార్లు ప్రసంగించారు. ఆయన తర్వాత ఇందిరా గాంధీ నాలుగుసార్లు విదేశీ పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సమయంలో నెహ్రూ మూడుసార్లు, రాజీవ్ గాంధీ రెండుసార్లు, పీవీ నరసింహారావు ఒకసారి ప్రసంగించారు.

విదేశీ పార్లమెంట్​లో..
2014లో ప్రధాని ఆస్ట్రేలియా, ఫిజి, భూటాన్, నేపాల్ పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు. 2015లో బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్థాన్​, మారిషస్ పార్లమెంట్​లో మట్లాడారు. అమెరికా హౌస్​లో మోదీ రెండుసార్లు మాట్లాడారు. మొదటిసారి 2016లో, రెండోసారి 2023లో ప్రసంగించారు. 2018లో ఉగాండాలో 2019లో మాల్దీవులు, 2024లో గయానా పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు.

గ్లోబల్ స్థాయిలో గౌరవం
మోదీ 17సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన విషయాన్ని బీజేపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘తక్కువ కాలంలోనే విదేశీ పార్లమెంట్లలో 17 ప్రసంగాలు చేశారు. గత ప్రధానులందరూ కలిసి చేసిన ప్రసంగాన్ని మోదీ సమం చేశారు. ఆయన నాయకత్వానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం దక్కుతోంది’ అని బీజేపీ ట్వీట్ చేసింది.

బుధవారం భారత్‌కు పయనమయ్యారు

భారత్-ఆఫ్రికా సంబంధాలపై నమీబియా పార్లమెంట్​లో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఆఫ్రికాతో సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు. కలసి ఎదగాలన్నదే తమ లక్ష్యమని మోదీ చెప్పారు. తమ భాగస్వామ్యం విలువ ఇప్పటికే 12 బిలియన్ డాలర్లు దాటిందన్నారు. జీ20లో తన అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అలాగే, కరోనా సమయంలో వ్యాక్సిన్లు, ఔషధాలు అందించినందున ఆఫ్రికా దేశాలు భారతావనికి కృతజ్ఞతగా చూపిస్తున్నాయని చెప్పారు. ‘ఆరోగ్య మైత్రీ’ కార్యక్రమం ద్వారా ఆసుపత్రులు, మెడికల్ కిట్‌లు, శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ యాత్రతో మోదీ తన ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తిచేసి బుధవారం భారత్‌కు పయనమయ్యారు .

నరేంద్ర మోడీ చరిత్ర ఏమిటి?
నరేంద్ర దామోదర్దాస్ మోడీ (జననం 17 సెప్టెంబర్ 1950) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అతను 2014 నుండి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు.
భారతదేశ విజయవంతమైన ప్రధానమంత్రి ఎవరు?
భారతదేశ ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరిగా మరియు అత్యుత్తమ నిర్వాహకులలో ఒకరిగా గొప్ప మరియు ఆచరణాత్మక అనుభవాన్ని తెచ్చుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Narendra Modi : నరేంద్రమోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం

#telugu News Indian PM speeches abroad Modi foreign speeches Modi global diplomacy Modi in foreign parliaments Modi international visits Narendra Modi achievements PM Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.