📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : PM Modi : ఆపరేషన్ సింధూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి : ప్రధాని మోదీ

Author Icon By Sudha
Updated: October 21, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ లేఖ రాశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అన్నారు. ఈ ఆపరేషన్‌ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూరే ఇందుకు ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతోపాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయి. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేక మంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. దేశానికి ఇది ఒక గొప్ప విజయం’ అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)లేఖలో రాసుకొచ్చారు.

Read Also: festival: మిగిలిన నూనె కోసం జనం పోటీ: అయోధ్యలో వైరల్ వీడియో

PM Modi

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించిన విషయాన్ని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు. ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక పౌరులు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అన్ని భాషలను గౌరవించాలని సూచించారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని కోరారు. మనం తీసుకునే ఆహారంలో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించి యోగాను ఆచరిద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ మనలను వికసిత్‌ భారత్‌ వైపు నడిపిస్తాయని చెప్పారు.ఆపరేషన్ సిందూర్ నిర్వహణ సమయంలో మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు, రాత్రంతా సంబంధిత బృందాలతో సంప్రదింపులు నిర్వహించారని సమాచారం ఉంది.

మోడీ స్వస్థలం ఏది?

నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ 1950 సెప్టెంబర్ 17న బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత గుజరాత్)లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నేపథ్యం మరియు హిందూ విశ్వాసం కలిగిన గుజరాతీ కుటుంబంలో జన్మించారు.

మోడీ ఎన్ని సార్లు ప్రధాని అయ్యారు?

2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Navy latest news Lord Ram Narendra Modi Operation Sindhur PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.