అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ (Prime Minister)ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ధర్మ ధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు అని, భారతీయ నాగరికతకు పునర్జీవంగా ఈ పతాకం నిలుస్తుందని అన్నారు. కాషాయ జెండా సూర్యవంశానికి చిహ్నమని, ఓం అక్షరం.. కోవింద వృక్షం .. రామరాజ్యానికి సంకేతంగా నిలుస్తుందన్నారు. సంకల్పానికి, సక్సెస్‌కు ఈ జెండా చిహ్నమన్నారు. వందేళ్ల పోరాటానికి.. రాబోయే వేల శతాబ్ధాలకు ఈ జెండా రాముడి విలువలను చాటుతుందన్నారు.సత్యమే ధర్మం అని ప్రధాని మోదీ (Prime Minister)అన్నారు. వివక్ష, బాధ ఉండకూడదని, శాంతి.. సంతోషం ఉండాలన్నారు. పేదరికం ఉండకూడదని, ఎవరూ నిస్సహాయంగా ఉండరాదన్నారు. గుడికి రాలేని వారు, గుడిపై ఎగురుతున్న జెండాను చూసినా.. వారికి అంతే పుణ్యం దక్కుతుందని మన గ్రంధాలు చెబుతాయని, చాలా దూరం నుంచి కూడా జెండాను చూసి రామ్‌లల్లా పుట్టిన ప్రదేశం ఇదే అన్న ప్రేరణ పొందవచ్చు అన్నారు.
Read Also : http://Modi Flag Hosting: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం
ఈ అద్భుతమైన సందర్భంలో కోట్లాది మంది రామ భక్తులకు హృదయ పూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రామాలయ నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రామాలయ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడు, కళాకారుడు, ప్లానర్, ఆర్కిటెక్ట్, వర్కర్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: