📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran War: భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

Author Icon By Vanipushpa
Updated: March 13, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు. పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడిన అంశాలను ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాల విధ్వంసంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో భారతీయ పౌరుల భద్రత, క్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ప్రధాని స్పష్టం చేశారు. సరకు రవాణా, ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల ద్వారా రవాణా నిరంతరాయంగా సాగాలని కోరారు. హింసకు స్వస్తి పలికి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని హితవు పలికారు. పశ్చిమాసియా దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఇరాన్‌లో 9 వేల మంది, ఇజ్రాయెల్‌లో 40 వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు.

Read Also: Iran-USA: ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

Iran War: Modi calls Iranian President on security of Indians

LPG విషయంలో ఇలాంటి చర్యలు దేశానికి నష్టం

అంతకుముందు దిల్లీలోని NXT సమ్మిట్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశంలో LPG కొరత ఉందంటూ కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. LPG విషయంలో ఇలాంటి చర్యలు దేశానికి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కొన్ని వస్తువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని, అలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభం ఏ దేశాన్నీ వదల్లేదని, అయితే భారత ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మనమంతా కలిసికట్టుగా దేశాన్ని కొవిడ్ సంక్షోభం నుంచి ఎలాగైతే బయటపడేశామో, అలాగే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అటు పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న సుమారు 9వేల మంది భారతీయుల భద్రత కోసం కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఎంబసీ సహాయంతో స్వదేశానికి చేరుకున్నారు. మిగతా వారిని సైతం సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

diplomatic phone call India-Iran relations Indian expats safety Iranian President Middle East crisis PM Narendra Modi safety of Indians in Iran Telugu News Paper Telugu News Today West Asia tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.