క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2025) వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌లో ఉదయం ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సేవలో ప్రార్థనలు, క్రిస్మస్ కారోల్స్, హిమ్స్‌లు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభు యేసుకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు (Christmas 2025) చేశారు.
Read Also: TamilNadu Accident:చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం
ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసారు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, “ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌లో క్రిస్మస్ ఉదయ సేవలో పాల్గొన్నాను. ఈ సేవ ప్రేమ, శాంతి, కరుణ.. శాశ్వత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిస్మస్ ఆత్మ మన సమాజంలో సామరస్యాన్ని, మంచితనాన్ని ప్రేరేపించాలి” అని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: