हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

PM Modi : ఆపరేషన్ సింధూర్’ – ప్రధాని మోదీ పెట్టిన పేరే

Digital
PM Modi : ఆపరేషన్ సింధూర్’ – ప్రధాని మోదీ పెట్టిన పేరే

ఆపరేషన్ సింధూర్ – ప్రధాని మోదీ నిర్ణయించిన పేరు!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులకు పాల్పడింది. ఈ దాడులకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును ఎవరు పెట్టారని మొదట సందేహాలు వచ్చినా, అధికారిక వర్గాలు స్పందిస్తూ ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన పేరు అని వెల్లడించాయి.పహల్గాం(Pahalgam) దాడిలో జరిగిన నష్టాన్ని గమనించిన మోదీ, దీనికి గట్టి ప్రతీకారం తీసుకోవాలని స్పష్టంగా అధికారులను ఆదేశించారు. “మన మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారిని వదిలిపెట్టకూడదు” అనే భావనతో, ఈ దాడికి “ఆపరేషన్ సింధూర్” అని పేరు పెట్టినట్లు సమాచారం. హిందూ సంప్రదాయంలో సింధూరం (Operation Sindhoor)పెళ్లైన మహిళకు ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. కానీ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మహిళలు తమ సింధూరాన్ని కోల్పోయారు.ఈ దాడిలో హిమాని అనే యువతికి ఎదురైన విషాదకర ఘటన దేశాన్ని కదిలించింది. ఆమె భర్త వినయ్ నర్వాల్, భారత నేవీ అధికారి. పెళ్లైన ఆరు రోజులకు ముష్కరులు ఆయన్ను మతం అడిగి కాల్చిచంపారు. భర్త మృతదేహం వద్ద హిమాని గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని రేకెత్తించాయి.

PM Modi సూచించిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడి – భారత్ ప్రతీకారం

ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మరింత భావనాత్మకంగా మారింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ప్రారంభమైన ఈ మెరుపుదాడిలో భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా పాలుపంచుకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మిస్సైళ్లతో దాడులు జరిపారు.ఈ దాడుల సమయంలో పాక్ సైనిక స్థావరాలను గైర్హాజరుగా ఉంచడం ద్వారా భారత్ యుద్ధాన్ని కోరదన్న తన స్పష్టమైన ఉద్దేశాన్ని చాటిచెప్పింది. భారత్ లక్ష్యంగా పెట్టుకున్నది సీమాంతర ఉగ్రవాద శక్తులే అని కేంద్ర రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. దాడులు పూర్తిగా కచ్చితంగా నిర్వహించబడ్డాయని, పాక్ రెగ్యులర్ ఆర్మీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా “ఆపరేషన్ సింధూర్” అనే పేరుకు ప్రధాని మోదీ ఆత్మబలిదానానికి ప్రతీకగా భావించి పెట్టినట్టు తెలుస్తోంది. సింధూరం కేవలం మహిళల శృంగార చిహ్నం మాత్రమే కాదు, భర్త పట్ల ప్రేమ, భద్రతకు సంకేతం. అలాంటి సింధూరాన్ని కోల్పోయినవారి బాధను బేరీజు వేసుకుని, భారత్ చూపించిన గట్టి స్పందన పేరు కూడా మోదీ పంచాంగానుగుణంగా ఎన్నుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Read More : Mock Drill : హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870