ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. ఇప్పుడు కష్టపడేతత్వం, నైపుణ్యం ఉన్న పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని అన్నారు. యువతలో క్రీడా సంస్కృతి, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఢిల్లీలో నిర్వహించిన ‘సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది ప్రతిభావంతులైన క్రీడాకారులను దేశం గుర్తిస్తున్నదని ప్రధాని చెప్పారు. 2014 కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, అక్రమాలు ఉండేవని, ఆ విధానానికి ముగింపు పలికి దశాబ్దమైందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మెరుగయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పేద కుటుంబాల పిల్లలు కూడా ప్రతిభ, కష్టపడే తత్వంతో క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.
Read Also: http://Vaibhav Suryavanshi: వైభవ్ పై ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్
2014 కు ముందు క్రీడల కోసం దేశ బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయిస్తే.. ఆ తర్వాతి కాలంలో రూ.3 వేల కోట్ల కంటే ఎక్కువ కేటాయిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రత్యేక పథకాల ద్వారా అర్హులైన అథ్లెట్లకు నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.
మోడీ ఎన్ని సార్లు ప్రధాని అయ్యారు?
2024 భారత సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు, బిజెపి మెజారిటీని కోల్పోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అలా చేసిన రెండవ వ్యక్తి ఇది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: