📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: PM Modi – ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ తెలిపిన ముఖేశ్ అంబానీ

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమయంలో, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రత్యేకంగా స్పందించారు. ఆయన తన అభినందన సందేశంలో మోదీ నాయకత్వాన్ని కొనియాడుతూ, భారత స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి కూడా మోదీయే దేశానికి ప్రధానిగా సేవలు అందించాలని తన హృదయపూర్వక ఆకాంక్షను వ్యక్తం చేశారు.భారత్‌ను ఒక గ్లోబల్ సూపర్ పవర్‌ (A global superpower) గా మార్చేందుకు ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ముఖేశ్ అంబానీ కొనియాడారు.

దేశ భవిష్యత్తు కోసం ఇంతలా శ్రమించే నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. మొదట గుజరాత్‌ (Gujarat) ను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన మోదీ, ఇప్పుడు యావత్ భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మారుస్తున్నారని ప్రశంసించారు. 145 కోట్ల భారతీయులతో కలిసి తాను ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ఆయన నిండు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానని అంబానీ తన సందేశంలో పేర్కొన్నారు.

PM Modi

పారిశ్రామిక దిగ్గజాలు సైతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ

ముఖేశ్ అంబానీతో పాటు ఇతర పారిశ్రామిక దిగ్గజాలు సైతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ప్రధాన మంత్రితో ప్రతి సమావేశం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ (Uday Kotak) అన్నారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలను నేర్చుకుని, వాటిని భారత్‌కు అనుగుణంగా మార్చడం మోదీ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.

సమ్మిళిత అభివృద్ధికి ప్రధాని బలమైన పునాది

భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ (Sunil Bharti Mittal) మాట్లాడుతూ, టెక్నాలజీని ఉపయోగించి సమ్మిళిత అభివృద్ధికి ప్రధాని బలమైన పునాది వేశారని అన్నారు.ప్రధాన మంత్రి మోదీ ఎంతో ఓపికగా తాము చెప్పే విషయాలను వింటారని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు.

ప్రైవేట్ రంగం (Private sector) లో పెట్టుబడులను పెంచడానికి ఏం చేయాలో ఎప్పుడూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటారని ఆయన వివరించారు. కాగా, ప్రధాని 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/singareni-gold-copper-exploration-license-karnataka/telangana/548962/

75th birthday Breaking News global superpower Gujarat development india latest news Leadership Mukesh Ambani Narendra Modi prime minister reliance industries Telugu News Wishes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.