వంతారాలో పులి పిల్లలను ఆడిస్తున్న ప్రధాని

Read Time:  1 min
PM Modi is playing with tiger cubs in Vantara
PM Modi is playing with tiger cubs in Vantara
FONT SIZE
GET APP

అహ్మదాబాద్‌: వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సందర్శించారు. ప్రధాని మోడీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గిర్‌ అడవుల్లో సఫారీకి వెళ్లారు. ఇవాళ జామ్‌నగర్‌ లోని వంతారాను సందర్శించారు. వన్యప్రాణుల ఆసుపత్రిని, జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు.

వంతారాలో పులి పిల్లలను ఆడిస్తున్న

వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితం

అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడ సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. దేశ, విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం ‘వంతారా’ ముఖ్య లక్ష్యం.

ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణం

ఈ క్రమమంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా మోడీకి స్వాగతం పలికారు. అనంతరం అనంత్‌ అంబానీతో కలిసి ప్రధాని మోడీ వంతారా మొత్తం కలియదిరిగారు. వంతారా అనేది కృత్రిమ అడవి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లో ఇది ఉన్నది. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో దాదాపు 2వేల వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.