📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest Telugu news: PM Modi – ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్‌ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది

Author Icon By Sudha
Updated: September 2, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ పై అమెరికా విధిస్తున్న సుంకాలను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్‌ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందని చెప్పారు. దేశ ఆర్థికవ్యవస్థ (Economy)అంచనాలను మించి రాణిస్తోందన్నారు. ఢిల్లీలోని బశోభూమిలో నిర్వహించిన ‘సెమీకాన్‌ ఇండియా 2025’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందని ప్రధాని (Prime Minister)చెప్పారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్‌ ఇండియా కోసం భారత్‌కు రావాలని, ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వ పాలనలో భారత్‌లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత లాంటి పలు మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.

PM Modi – ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్‌ 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని ప్రధాని (Prime Minister)విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ వృద్ధి కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా అన్నిరంగాల్లో కనిపిస్తోందని అన్నారు. తాము మేడిన్‌ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్నామని ప్రపంచదేశాలు చెప్పుకునే రోజు త్వరలోనే రానుందని చెప్పారు. సెమీకాన్‌ ఇండియా 2025 సదస్సులో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందనడానికి ఇదే ఉదాహ రణ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్‌కు ఆదరణ తగ్గలేదని చెప్పారు. భారత్‌పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో మోదీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మోడీ అర్హతలు?

1978లో, మోడీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ నుండి రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) డిగ్రీని పొందారు. 1983లో, గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (MA) డిగ్రీని పొందారు, బాహ్య దూరవిద్య విద్యార్థిగా మొదటి తరగతిలో పట్టభద్రుడయ్యారు.

ప్రధానమంత్రి వయస్సు పరిమితి?

ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎంపిక సమయంలో లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడు కాకపోతే, అతను ఆరు నెలల్లోపు రెండు సభలలో దేనిలోనైనా సభ్యుడిగా ఉండాలి. లోక్‌సభ సభ్యుడైతే 25 ఏళ్లు పైబడి ఉండాలి లేదా రాజ్యసభ సభ్యుడైతే 30 ఏళ్లు పైబడి ఉండాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/prime-minister-modi-deeply-shocked-by-the-incident-in-afghanistan/national/539568/

7.8 percent growth Breaking News development Economic Growth GDP india Indian Economy latest news PM Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.