West Bengal news: పశ్చిమ బెంగాల్‌లో వాతావరణం ప్రతికూలంగా మారడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను తిరిగి మళ్లించాల్సి వచ్చింది. నాడియా జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా తాహెర్‌పూర్ హెలిప్యాడ్‌లో ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ కోల్‌కతా విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది.
Read Also: AI Computing: గూగుల్ Torch TPU సీక్రెట్ మిషన్..
వాతావరణ ప్రతికూలతతో షెడ్యూల్‌లో మార్పు
అధికారుల సమాచారం ప్రకారం, హెలిప్యాడ్ వద్ద కొంతసేపు ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించినా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఉత్తర భారతంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోనూ పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు.
శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్(West Bengal) పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తాహెర్‌పూర్‌కు బయలుదేరారు. అయితే దృశ్యమానత తగ్గిపోవడంతో ల్యాండింగ్ విఫలమైంది. రోడ్డు మార్గంలో వెళ్లితే కార్యక్రమ షెడ్యూల్ దెబ్బతింటుందని భావించిన ప్రధాని, విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ నుంచే వర్చువల్‌గా నాడియా సభలో పాల్గొని ప్రసంగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: