📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు

Author Icon By Saritha
Updated: December 3, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఓటరు జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) కొనసాగుతోంది. ఈ ప్రక్రియను(Modi) అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్‌ బీజేపీ(BJP) ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. అర్హులైన ప్రతి ఓటరినీ జాబితాలో చేర్చడం, అర్హత లేనివారిని తప్పకుండా తొలగించడం ఈ సవరణ లక్ష్యమని, అదే సందేశాన్ని గ్రామ వార్డు స్థాయికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన ఆదేశించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

Read also: ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

PM’s key instructions to BJP MPs in West Bengal

2026 ఎన్నికల సిద్ధతపై ఎంపీలకు దిశానిర్దేశం

అలాగే 2026 అసెంబ్లీ ఎన్నికలకు(Modi) ఇప్పటి నుంచే పూర్తి సిద్ధతతో పని చేయాల్సిన అవసరాన్ని మోదీ పెంపొందించారని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌ లేదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా, విపక్షాలు వేసే వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎంపీలను హెచ్చరించారు. 2011లో బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండగా, 2021లో పార్టీ శక్తి 65 ఎమ్మెల్యేల వరకు పెరిగిందని గుర్తుచేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని సూచించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ప్రధాని ఈ వ్యవహారంపై స్పందించటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

assembly elections BJP Election Commission Google News in Telugu Indian Politics Mamata Banerjee PM Modi SIR Revision Voter List West Bengal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.