📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

PM Modi: వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Author Icon By Sudha
Updated: July 9, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి (PM Modi) జాతీయ సహాయ నిధి కింద బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా(Ex-gratia) ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రధాని మోదీ (PM Modi) ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

PM Modi: వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ప్రత్యామ్నాయ మార్గాలు

వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీర్‌ వంతెన బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని వడోదర-ఆనంద్‌ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెనను 45 ఏళ్ల క్రితం నిర్మించారు.

అయితే చాలా కాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరినట్లు స్థానికులు తెలిపారు. తాజా ఘటనతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు (NDRF) చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గాలి కారణంగా ఏ వంతెన కూలిపోయింది?

1940 టకోమా నారోస్ వంతెన కూలిపోవడం అందరినీ ముఖ్యంగా ఇంజనీర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత అధునాతన డిజైన్‌తో కూడిన అత్యంత “ఆధునిక” సస్పెన్షన్ వంతెన సాపేక్షంగా తేలికపాటి గాలికి ఎలా వినాశకరమైన వైఫల్యాన్ని చవిచూసింది.

భారతదేశంలో ఎన్ని వంతెనలు కూలిపోయాయి?

గత 3 సంవత్సరాలలో NH లపై 21 వంతెనలు కూలిపోయాయి.
న్యూఢిల్లీ: గత మూడు సంవత్సరాలలో జాతీయ రహదారులపై మొత్తం 21 వంతెనలు కూలిపోయాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభకు తెలియజేసింది.
బీహార్‌లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tahawwur Rana: తహవూర్ రాణా మరోసారి కస్టడీ పొడిగింపు

Breaking News Bridge Collapse Ex-Gratia Announcement Gujarat Incident latest news PM Modi Prime Minister Statement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.