📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: PM Modi Biopic: మోదీపై మ‌రో బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో ఎవరు నటించనున్నారంటే?

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 6:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఉన్ని ముకుందన్‌ (Unni Mukundan) మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi biopic) జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్ని భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘మా వందే’ (Maa Vande title) అనే శీర్షికను ఖరారు చేశారు.

ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రకటించడం విశేషం. ఉన్ని ముకుందన్ తన సోషల్‌ మీడియా (Social media) ప్లాట్‌ఫారమ్‌లలో ఈ విషయాన్ని పంచుకుంటూ, “దేశ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన నాయకుడి జీవితం పోషించే అవకాశం రావడం గర్వకారణం” అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మోదీ గారి జీవితంలోని విభిన్న పార్శ్వాలు, పోరాటాలు, కష్టసుఖాలు ప్రేక్షకులకు చేరువ అవుతాయని ఆయన తెలిపారు.

View this post on Instagram

A post shared by Unni Mukundan (@iamunnimukundan)

మోదీపై త‌న‌కు ప్ర‌త్యేక అభిమానం క‌లిగిన‌ట్లు

అహ్మాద్‌బాద్‌ (Ahmedabad) లోనే పెరిగాన‌ని, త‌న చిన్న‌త‌నంలో మోదీని సీఎంగా చూశాన‌ని, ఆ త‌ర్వాత 2023 ఏప్రిల్‌లో ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకున్నాన‌ని, ఆ స‌మయంలో మోదీపై త‌న‌కు ప్ర‌త్యేక అభిమానం క‌లిగిన‌ట్లు ముకుంద‌న్ తెలిపారు. ఓ న‌టుడిగా ప్ర‌ధాని మోదీ పాత్ర‌ను పోషించడం ప‌ట్ల సంతోషంగా ఫీల‌వుతున్నాన‌ని, ఇది చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంద‌న్నారు.

ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ జీవితం అసాధారణముగా, సాగింద‌ని, అయితే తాము తీయ‌బోయే సినిమాలో మోదీని మ‌రో కోణంలో చూపిస్తామ‌ని, త‌న మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని ఆ ఫిల్మ్‌లో ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌నున్న‌ట్లు న‌టుడు ఉన్ని ముకుంద‌న్ తెలిపారు. ఎవ‌రి ముందు త‌ల‌వంచ‌వ‌ద్దు అని గుజ‌రాతీ (Gujarati) లో మోదీ చెప్పేవార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌ధాన భాష‌ల్లో మా వందే సినిమాను తీస్తామ‌ని, ఆ త‌ర్వాత దాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్‌చేయనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hollywood-actress-sydney-sweeney/cinema/549261/

all Indian languages release Breaking News Kranti Kumar CH director latest news Maa Vande title PM Modi 75th birthday announcement PM Modi biopic Telugu News Unni Mukundan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.