📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 2,000.. వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!

Author Icon By Vanipushpa
Updated: March 13, 2026 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM Kisan) పథకంలో భాగంగా 22వ విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. సాగు ఖర్చుల కోసం పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఈ రూ. 2,000 కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు అసోం వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ. 18,640 కోట్లు జమ కానున్నాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతులకు రూ. 49,000 కోట్లకు పైగా అందించారు. విశేషమేమిటంటే, ఈ విడతలో దాదాపు 2.15 కోట్ల మంది మహిళా రైతులు కూడా లబ్ధి పొందనున్నారు.

Read Also: TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు

PM Kisan: Check if Rs. 2,000 has arrived in farmers’ accounts!

లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి

మీకు ఈ రూ. 2,000 వస్తాయో లేదో తెలుసుకోవడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే గ్రామవారీగా ఉన్న లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. ముందుగా PM Kisan అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించండి. హోమ్‌పేజీలో ఉన్న ‘Beneficiary List’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తదుపరి పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, మండలం (Tehsil) ఎంచుకోండి. ఆ తర్వాత మీ బ్లాక్ , గ్రామం పేరును సెలెక్ట్ చేయండి. చివరగా ‘Get Report’ బటన్‌పై క్లిక్ చేయగానే మీ ఊరి లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉంటే తప్పకుండా మీ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఈ నిధులు ఎవరికి అందవు? కొంతమంది రైతులకు ఈసారి రూ. 2,000 వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం కింది కారణాల వల్ల డబ్బులు ఆగిపోవచ్చు. ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ లబ్ధిదారులుగా నమోదైతే ఒకరికే నిధులు అందుతాయి. పెన్షన్: నెలకు రూ. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

direct benefit transfer (DBT) e-KYC update for farmers farmers 2000 rupees credit Modi gas release news PM Kisan 22nd installment PM Kisan beneficiary list 2026 PM Kisan Status Check Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.