📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని కోట్లాది మంది రైతులకు ముఖ్యమైన పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి పథకంలో మరో ముందడుగు పడింది. శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 20వ విడత నిధులను విడుదల చేశారు. ఒక్క క్లిక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు నేరుగా జమ అయ్యాయి.

PM Kisan

రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకే పథకం

వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తున్నారు. తాజా విడతతో రైతులు ఖరీఫ్ పంటల (Kharif crops) సీజన్‌కి అవసరమైన పెట్టుబడి ఖర్చులను సమకూర్చుకోగలుగుతారు.

ఇప్పటి వరకూ అందిన సాయం వివరాలు

ఈ పథకం క్రింద గత 19 విడతల్లో సుమారు రూ.3.46 లక్షల కోట్ల ఆర్థిక సాయం రైతులకు అందించింది. 19వ విడతను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. అప్పట్లో 9.8 కోట్ల మంది రైతులకు రూ.22,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kerala-father-fights-leopard-to-save-son/national/524824/

20th installment agriculture support Breaking News farmer welfare latest news PM Kisan Yojana PM Modi Telugu News ₹2000 to farmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.