బుధవారం (జనవరి 28) ఉదయం 8.48 గంటలకు జరిగిన విమాన ప్రమాదం (Plane Crash) లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు మరణించారు. ముంబై నుంచి బారామతిలో జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. బారామతి ఎయిర్ పోర్టులో VT-SSK లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నికల్ సమస్యలతో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
Read Also: US: H-1B వీసాలపై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
అజిత్ పవార్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేత అయిన పవార్ ప్రజాసేవ చిరస్మరణీయమని పవన్ కొనియాడారు.
క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలున్న అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయామని, మహారాష్ట్ర రాజకీయాలకు ఇది తీరని లోటని కేటీఆర్ అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కూడా అజిత్ పవార్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఈ ఉదయం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ అకాల మరణం వార్త విని తీవ్రంగా కలత చెందాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవార్ మరణం ప్రజా జీవితానికి తీరని లోటని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: