📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం.. పిటీష‌న్ల‌పై సుప్రీంకోర్టు అస‌హ‌నం

Author Icon By sumalatha chinthakayala
Updated: February 17, 2025 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆ పిటీష‌న్ల‌కు ఓ ప‌రిమితి ఉండాలి..

న్యూఢిల్లీ: 1991 నాటి ప్రార్థ‌నా స్థ‌లాల చ‌ట్టం పై ఇంకా పిల్స్ దాఖ‌లు అవుతున్నాయి. ఆ చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ కేసులు ఫైల్ చేయ‌డాన్ని సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. మ‌ధ్యంత‌ర అప్లికేష‌న్లు దాఖ‌లు చేయ‌డానికి ఓ ప‌రిమితి ఉండాలని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ పీవీ సంజ‌య్ కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం .. ప్రార్థ‌న స్థ‌లాల చ‌ట్టం అమ‌లుపై వాద‌న‌లు చేప‌ట్టింది.

ఏప్రిల్ మొద‌టి వారంలో విచారణ

మ‌ధ్యంతర పిటీష‌న్లు ఎక్కువ కావ‌డంతో ఈరోజు ఆ కేసును విచార‌ణకు స్వీక‌రించ‌లేమ‌న్నారు. త్రిసభ్య ధర్మాసనం ముందు మ‌రీ ఎక్కువ సంఖ్య‌లో పిటీష‌న్లు ఉన్నాయ‌ని, ఈ కేసును మ‌ళ్లీ ఏప్రిల్ మొద‌టి వారంలో విచారించ‌నున్న‌ట్లు సుప్రీం తెలిపింది. మ‌ధ్యంత‌ర పిటీష‌న్లు వేయ‌డానికి ఓ ప‌రిమితి ఉండాల‌ని జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా తెలిపారు.

ప్రార్థనా స్థలాల విషయంలో సుదీర్ఘకాలంగా వివాదాలు

కాగా, ఈ అంశంలో ప్రధానమైన చర్చ అంతా సెక్షన్ 3, 4 మీద ఆధారపడి ఉంది. ఆ సెక్షన్లు కోర్టు ధార్మిక స్వభావాన్ని నిర్వచించి, దాన్ని మార్చేయడాన్ని నిలువరిస్తాయి. అలాగే కోర్టు పరిధిని కూడా పరిమితం చేస్తాయి. దేశంలోని పలు మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల విషయంలో సుదీర్ఘకాలంగా వివాదాలు ఉన్న సంగతిని ప్రస్తావిస్తూ… జ్ఞానవాపి మసీదు కమిటీ సహా ముస్లిం పక్షాలు… ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తున్న పిటిషన్లను కొట్టేయాలని వాదిస్తున్నాయి.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Places of Worship Act Supreme Court Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.