📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

Pinarayi Vijayan: ది కేరళ స్టోరీకి జాతీయ అవార్డు ఇవ్వడంపై మండిపడ్డ కేర‌ళ సీఎం

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జాతీయ అవార్డుల ప్రకటనతో మరోసారి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం చుట్టూ వివాదం చెలరేగింది. తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం రెండు ప్రధాన విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు కేటగిరీలో సుదీప్తో సేన్, ఉత్తమ సినీమాటోగ్రఫీ విభాగంలో వసంతను మొహపాత్రో ఈ అవార్డులను గెలుచుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రానికి అవార్డులు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రాన్ని అవమానించిందని దుయ్యబట్టారు. కేరళలో జరుగుతోన్న లవ్ జిహాదీ, మత మార్పిడులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్ చేయడం వంటి అంశాలను ‘ది కేరళ స్టోరీ చిత్రం (The Kerala Story) లో చూపించడం గతంలోనే తీవ్ర వివాదానికి దారితీసింది.

జాతీయ అవార్డులు

ఈ చిత్రం విడుదల సమయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రోత్సాహం వల్లే అసత్య కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని వారు ఆరోపించారు.కేరళ ప్రతిష్టను దెబ్బతీసే, మత విద్వేషానికి బీజాలు వేసే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన చిత్రానికి జాతీయ అవార్డులు ప్రకటించడం అంటే కచ్చితంగా సంఘ పరివార్ భావజాలానికి చట్టబద్ధత కల్పించినట్లే. మత పరమైన శక్తులకు వ్యతిరేకంగా ఉంటూ, ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటే కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించినట్లే. మలయాళీలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ చర్యని ఖండించాలి’ అని అన్నారు.

కేరళలో అధికార భాష ఏది?

మలయాళం కేరళ రాష్ట్ర అధికార భాష.

కేరళను “గాడ్స్ ఓన్ కంట్రీ” (God’s Own Country) అని ఎందుకు పిలుస్తారు?

Read hindi news: hindi.vaartha.com

కేరళ ప్రకృతి సౌందర్యం, బ్యాక్‌వాటర్స్, పచ్చని కొండలు, నదులు, సముద్ర తీరాలు కారణంగా “గాడ్స్ ఓన్ కంట్రీ” అని పిలుస్తారు.

Read Also: 

https://vaartha.com/himachal-pradesh-dam-collapse-flood-disaster/national/524893/

Best Cinematography Vasanth Mohapatro award Best Director Sudipto Sen award news Breaking News Kerala CM Pinarayi Vijayan angry reaction latest news Telugu News The Kerala Story national awards controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.