📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Pinaka MK-3: ప్రమాదకర రాకెట్ లాంచర్‌ను టెస్ట్ చేయనున్న భారత్

Author Icon By Sharanya
Updated: May 27, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం తన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ అత్యాధునిక గైడెడ్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ “పినాక ఎంకే-3″ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఇది సరిహద్దుల్లో భారత్‌కు ఎదురవుతున్న చైనా, పాకిస్థాన్ లాంటి శత్రుదేశాలకు గట్టి జవాబుగా మారనుంది. ఈ వ్యవస్థను DRDO (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలోని పుణె కేంద్రం ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE), ఇమారత్ (RCI) వంటి అనుబంధ సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.

పినాక సిరీస్‌లో అగ్రగామి వెర్షన్

పినాక ఎంకే-3 పూర్వ వేరియంట్‌లైన ఎంకే-1, ఎంకే-2, గైడెడ్ పినాక కంటే ఎన్నో మార్గాల్లో ఆధునికమైనది. ఎంకే-1 (40 కి.మీ. పరిధి), ఎంకే-2 (60-90 కి.మీ. పరిధి), గైడెడ్ పినాక (75-90 కి.మీ. పరిధి) వెర్షన్ల కంటే ఇది అత్యాధునికమైనది. కానీ తాజా పినాక ఎంకే-3 వ్యవస్థ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు.

అత్యాధునిక సామర్థ్యాలు

ఇది 250 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలను నాశనం చేయడానికి ఇది సరిపోతుంది. ఈ రాకెట్ వ్యాసం 300 మిల్లీమీటర్లు. ఇది పాత 214 మిల్లీమీటర్ల వెర్షన్ కంటే పెద్దది. దీనివల్ల ఎక్కువ ఇంధనం, అధునాతన గైడెన్స్ వ్యవస్థలను అమర్చడానికి వీలవుతుంది. ఫలితంగా దీని పరిధి, పనితీరు పెరుగుతాయి.

టెక్నాలజీకి మారు పేరు

ఈ వ్యవస్థలో డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) అభివృద్ధి చేసిన హైటెక్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ (జీఎన్‌సీ) కిట్‌ను ఉపయోగించారు. ఇందులో లేజర్-గైరో నావిగేషన్, మైక్రోస్ట్రిప్ యాంటెనాలు ఉన్నాయి. ఇవి 10 మీటర్ల కంటే తక్కువ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ (సీఈపీ)తో అత్యంత కచ్చితత్వాన్ని అందిస్తాయి. పాత ఎంకే-1 సీఈపీ సుమారు 500 మీటర్లు ఉండేది.

ఇప్పటికే ఉన్న లాంచర్ల నుంచే ప్రయోగం

పినాక ఎంకే-3ని ప్రత్యేక లాంచర్ల అవసరం లేకుండా, ఇప్పటికే ఉన్న పినాక లాంచర్ల నుంచే ప్రయోగించవచ్చు. ఇది అదనపు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి లాంచర్ 8 గైడెడ్ రాకెట్లను మోసుకెళ్లగలదు. కేవలం 44 సెకన్లలో 700×500 మీటర్ల ప్రాంతంలో విధ్వంసం సృష్టించగలదు. పినాక ఎంకే-3 అభివృద్ధి కీలక సమయంలో జరిగింది. చైనాకు చెందిన పీహెచ్ఎల్-03 (పరిధి: 70–130 కి.మీ.), పాకిస్థాన్‌కు చెందిన ఏ-100 (పరిధి: 120 కి.మీ.) దూరశ్రేణి రాకెట్ వ్యవస్థలు భారతదేశాన్ని తన సామర్థ్యాలను పెంచుకోవడానికి పురికొల్పాయి. ఈ ముప్పులను ఎదుర్కోవడానికి 2021లో భారత సైన్యం పినాక వ్యవస్థ 120 కి.మీ., 300 కి.మీ. రేంజ్ వేరియంట్‌లకు ఆమోదం తెలిపింది.

Read also: India: భారత్ స్వదేశీ 5వ తరం ఫైటర్ జెట్‌కు కేంద్రం ఆమోదం

#DefenceTechnology #DRDO #indianarmy #MissileTest #PinakaMK3 #PinakaRocket #RocketLauncher Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.