📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Phone: ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి: బండి సంజయ్

Author Icon By Vanipushpa
Updated: August 9, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : బిఆర్ఎన్ (BRS) హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్(Phone Taping) కేసును వెంటనే
సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవాకం నాడు బండి సంజయ్ సిట్ అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. రాజ్ భవన్ మార్గంలో గల దిల్ కుషా గెస్ట్ హౌస్ లో గంటకు పైగా విచారణలో బండి సంజయ్ తో పాటు ఆయన సహాయకులు మధు, ప్రవీణ్ రావు, తిరుపతిలను వేరు వేరుగా విచారించి వారి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కాగా విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు
చేశారు. ఈ కేసులో మొదట మాట్లాడింది తానేనని ఆయన తెలిపారు.

Phone: ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి: బండి సంజయ్

నాయకుల ఫోన్లను విచ్చల విడిగా ట్యాపింగ్

బిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ బారినపడని వారు అతికొద్ది మంది మాత్రమే వున్నారని ఆయన అన్నారు. కెసిఆర్, కెటిఆర్, సంతోష్ కుమార్ల ఫోన్లు తప్ప హరీష్ రావు, కవిత సహా బిఆర్ఎస్ మంత్రు లు, ఎంఎల్ఎలు, ఎంపిలు, ఇతర నాయకుల ఫోన్లను విచ్చల విడిగా ట్యాపింగ్ చేశారని ఆయన విమర్శిం చారు. ఫోన్ ట్యాపింగ్ అప్పట్లో కెసిఆర్ కుటుం బానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చిందని బండి సంజయ్ ఆరోపించారు. వాస్తవానికి మావోయిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చే యడానికి ఉద్దేశించిన ఎస్బబి నక్సలైట్ల ముసుగులో ప్రతిపక్ష నాయకులతో పాటు స్వపక్షంలోని అనంతృప్తి నేతల ఫోన్లను నాటి సర్కారు ఇష్టాను సారం ట్యాపింగ్ చేసిందని ఆయన తెలిపారు. అప్పట్లోనే తాను ఫోన్ ట్యాపింగ్పై గళమెత్తానని, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని, తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని బండి సంజయ్ తెలిపారు.

గ్రూప్ వన్ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీక్

ఫోన్ ట్యాపింగ్పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వచ్చానని, తన వద్ద వున్న ఆధారాలు ఇచ్చానని ఆయన తెలిపారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కు భయపడి సాధారణ కాల్కు బదులు వాట్సాప్ కాల్స్ మాట్లాడేవారిమని ఆయన తెలిపారు. నక్సలైట్ల కార్యకలాపాలపై నిఘా వుంచేం దుకు ఏర్పాటయిన ఎస్ఐబిని అక్రమ ఫోన్ ట్యాపింగ్కు కేరాఫ్గా మార్చిన కెసిఆర్ కుటుంబం దీనిని పైసా వసూల్ కేంద్రంగా మార్చుకుందని ఆయన ధ్వజమెత్తారు. అప్పట్లో గ్రూప్ వన్ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీక్ అయితే తాను ధర్నా చేసేందుకు వెళ్లానని, అయితే మార్గమధ్యలోనే తనను అరె స్టు వేశారని, ఇది కూడా ట్యాపింగ్ కారణంగానే జరిగిందని ఆయన వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడ్డ వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో? ఎవరికి తెలియదని ఆయన తెలిపారు. అప్పట్లో వంద కోట్ల రూపాయలు పట్టుబడితే పది కోట్ల రూపాయలుగా చెప్పేవారని, ఈ డబ్బులన్నీ కెసిఆర్ కుటుంబం చేతుల్లో వెళ్లిందని ఆయన వెల్లడించారు..

సిట్ విచారణతో లాభం లేదు: సిబిఐకి అప్పగిస్తే అన్నీ వెల్లడవుతాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ విచారణ చేస్తున్నా ఇప్పటి వరకు ఏమీ జరగలేదని బండి సంజయ్ తెలిపారు. ట్యాపింగ్ కెసిఆర్ కుటుంబం పాత్ర వుందని ఆధారాలు వున్నా ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన తెలిపారు. సిట్ అధికారుల నిజాయితీపై తమకు అనుమానం లేదని, ప్రభుత్వ నిజాయితీపై నే అనుమానం వుందని ఆయన చెప్పారు. ఫోన్ ట్యాపింగ్పై జరుగుతున్న విచారణ తీరును చూస్తుంటే కెసిఆర్తో రేవంత్ రెడ్డి సర్కారు కుమ్మక్కైనట్లు తెలుస్తోందని బండి సంజయ్ వెల్లడించారు.

భారతదేశంలో రాష్ట్ర మంత్రి పాత్ర ఏమిటి?

సహాయ మంత్రిగా, ఇతర మంత్రుల కార్యకలాపాలను నియంత్రించడం మరియు సమన్వయం చేయడం ఆయన పాత్ర.

మంత్రులందరి పాత్ర ఏమిటి?

చట్టాలను రూపొందించడం: మంత్రుల మండలి శాసన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. మంత్రులు బిల్లులను ప్రవేశపెడతారు, చర్చలలో పాల్గొంటారు మరియు పార్లమెంటులో చట్టాలు ఆమోదించబడేలా చూస్తారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/supreme-court-pay-rs-1-75-lakh-crore-to-discoms/telangana/528138/#google_vignette

BandiSanjay CBI Investigation Latest News Breaking News law-and-order phone-tapping Telangana-education telangana-politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.