📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

PG Medical Course Guidelines: ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

Author Icon By Anusha
Updated: February 21, 2026 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PG Medical Course Guidelines: దేశంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త వినిపించింది. పీజీ కోర్సుల ప్రారంభం, నిర్వహణకు సంబంధించి నిబంధనలను సరళీకరిస్తూ ఒక కీలక ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇప్పటికే నడుస్తున్న మెడికల్ కాలేజీల్లో కొత్తగా పీజీ కోర్సులు (MD/MS) ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ (EC) తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల విద్యా సంస్థలపై పరిపాలనాపరమైన భారం తగ్గనుంది.

Read Also: West Bengal Crime: విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

కొత్త కాలేజీలకు మాత్రమే ఈసీ నిబంధన.. కార్పస్ ఫండ్ తప్పనిసరి

ఎన్‌ఎంసీ తన ముసాయిదాలో కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది. కేవలం కొత్తగా స్థాపించబోయే మెడికల్ కాలేజీలకు మాత్రమే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అలాగే, కాలేజీల ఆర్థిక స్థిరత్వం కోసం కార్పస్ ఫండ్ (Corpus Fund) నిర్వహణను తప్పనిసరి చేసింది.

PG Medical Course Guidelines: NMC new rules

ఈ నిధిని కేవలం కాలేజీ నిర్వహణ, అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలని నిబంధన విధించింది.యూనివర్సిటీ నుంచి పొందే కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్(సీవోఏ) దరఖాస్తు చేసేనాటికి వాలిడిటీ కలిగి ఉండాలని సూచించింది. అసంపూర్ణ దరఖాస్తులను నోటీసు లేకుండానే రిజెక్ట్ చేస్తామని తెలిపింది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు మార్చి 18లోపు ఎన్‌‌ఎంసీకి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Consent of Affiliation NMC Essentiality Certificate Exemption latest news NMC New Draft 2026 PG Medical Course Guidelines

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.