📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Petrol Crisis: పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

Author Icon By Vanipushpa
Updated: March 12, 2026 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత 12రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ లమధ్య యుద్ధం ఎడతెగకుండా సాగుతున్నది. నువ్వా నేనా
అన్నట్లుగా తగ్గేదే లే అంటూ పోటీపోటీగా దాడులు, ప్రతిదాడులకు పూనుకుంటున్నాయి. ఇరాన్(Iran) దేశంలోని ప్రఖ్యాత హర్మూజ్ జలసంధి మూసివేయడంతో ఆయాదేశాలకు సరఫరా కావాల్సిన చమురు ఓడలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఒక్క చుక్క ఆయిల్ కూడా బయటికి రానివ్వమని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్లాండ్, పాకిస్తాన్ వంటి దేశాలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా స్కూలు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. సాధ్య మైనంతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.

Read Also: WHO: పశ్చిమాసియాలో ఆరోగ్య సంక్షోభం: WHO డైరెక్టర్ జనరల్ ఆందోళన

Petrol Crisis: Petrol shortage.. People are stocking up heavily on fake news

ఫేక్ వార్తలతో ప్రజలు అప్రమత్తత

దీనికితోడు సోషల్ మీడియా పలు ఫేక్ వార్తలు హల్ చెల్ చేస్తున్నాయి. గ్యాస్ లేదంటూ, పెట్రోలు కొరత అంటూ, ధరలు అమాంతంగా పెరగనున్నట్లు, ఇక గ్యాస్ దొరకదని, పెట్రోలు ఉండదని వంటి అసత్య వార్తలు వరదల్లా వస్తున్నాయి. నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది అన్న సామెతలా ఒకవైపు మనదేశంలోని కేంద్రప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా, దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, అసత్య వార్తలే నిజమని నమ్ముతున్నారు. దీంతో ప్రజలు ముందుజాగ్రత్తగా పెట్రోలు అందినకాడికి స్టోరేజ్ చేసుకుంటున్నారు. తాజ ‘గా తమిళనాడులో పెట్రోల్ కొరత ఉందంటూ పలు పెట్రోల్ బంక్లలో ప్రజలు లీటర్లు లీటర్లు క్యాన్లలలో మోసుకుని వెళ్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాస్ కూడా కొరత ఉందని భావిస్తూ, అవసరం లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో గ్యాస్ కంపెనీలు తలలు పట్టుకుంటున్నారు. గ్యాస్ కంపెనీలకు జనం ఎగబడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Fake News on Fuel Crisis Government Assurance on Fuel Supply Petrol Pumps Rush Hyderabad Petrol Shortage Rumours India 2026 Telugu News Paper Telugu News Today WhatsApp Viral Messages Petrol Shortage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.