రాబోయే రెండేళ్లలో ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో సరఫరా భారీగా పెరగనుందని ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ తాజాగా అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం, ఓపెక్ ప్లస్ (OPEC+) కూటమి సభ్య దేశాలతో పాటు, నాన్-ఓపెక్ దేశాలు కూడా చమురు(Petrol Price) ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించడమేనని నివేదిక పేర్కొంది.
Read Also: Delhi Air pollution: 50% ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు(Petrol Price) ధర సుమారు $60 వద్ద ఉండగా, ఈ అధిక సరఫరా కారణంగా ధరలు తీవ్రంగా పడిపోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 2027 (FY2027) చివరి నాటికి బ్యారెల్ ధర $30 వరకు తగ్గవచ్చని వెల్లడించింది.
భారతదేశానికి గొప్ప ఊరట, పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం
ప్రపంచంలోనే ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటైన భారతదేశానికి (IND) ఈ ధరల పతనం భారీ లబ్ధిని చేకూర్చే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది గొప్ప ఊరటనిస్తుంది. అంతేకాకుండా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వల్ల దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణం (Inflation) నియంత్రణకు కూడా దోహదపడుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :