हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Petrol: ఇంధన పరిరక్షణ అవార్డులకు దరఖాస్తులు

Tejaswini Y
Telugu News: Petrol: ఇంధన పరిరక్షణ అవార్డులకు దరఖాస్తులు

రాష్ట్రంలోని ప్రధాన ఇంధన(Petrol) వినియోగ రంగాలైన పరిశ్రమలు, విద్యాసంస్థలు, పట్టణ, స్థానిక సంస్థలు రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు 2025(స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు (State Energy Conservation Award) పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్ఈసిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్. నాగలక్ష్మి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈ సిఎం) ఎస్ఈసిఏ 2025 ను వరుసగా ఐదో ఏడాది నిర్వహిస్తున్నట్లు సిఈఓ తెలిపారు.

Read Also: HYD: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రధాన ఇంధన(Petrol) వినియోగ రంగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించి, ఇంధన నిర్వహణ, ఆధునిక సాంకేతికతల వినియోగం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించిన సంస్థలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టు కుందని, ఈ పోటీ ద్వారా మరెన్నో పరిశ్ర మలు, సంస్థలను ఆధునిక ఇంధన పొదుపు విధానాలను అనుసరించేలా ప్రోత్సహిస్తోందని సీఈఓ తెలిపారు.

కనెక్టెడ్ లోడ్ ఆధారంగా అర్హత ఉన్న సంస్థలు

ఇంధన వినియోగం, కనెక్టెడ్ లోడ్ ఆధారంగా అర్హత ఉన్న సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిఈఓ కోరారు. ఎస్ఈసిఏ(SECA) 2025లో భాగంగా ఏడాదికి 30,000 ఎంటీఓఈ (మెట్రిక్ టన్ ఆయిల్ ఈక్వివలెంట్ కు పైగా ఇంధన వినియోగం ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ పరిశ్రమలు, 1,000 ఎంటీఓఈకు పైగా వినియోగం ఉన్న ఫార్మా పరిశ్రమలు, 50 కిలోవాట్లు మరియు అంతకంటే ఎక్కువ కనెక్టెడ్ లోడ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు (Government, Private), హోటళ్లు పాల్గొనవచ్చని తెలిపారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసి బస్ డిపోలు, బస్ స్టాండ్లు, పట్టణ, స్థానిక సంస్థలు, మున్సిపా లిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా పాల్గొనవచ్చని సిఈఓ పేర్కొన్నారు.

Petrol Applications for Fuel Conservation Awards

ఇంధన సామర్థ్య చర్యలు రాష్ట్రంలో వేగంగా

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. విజయానంద్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, తద్వారా ఇంధన సామర్థ్య చర్యలు రాష్ట్రంలో వేగంగా ముందుకు సాగుతున్నాయని సీఈఓ పేర్కొన్నారు.

ఇంధన పరిరక్షణ అవార్డు పోటీలో పాల్గొనే సంస్థలను వారు తీసుకున్న ఇంధన పొదుపు చర్యలు, స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గింపు, అత్యుత్తమ సాంకేతికతలు, ఇంధన సామర్థ్య నిర్వహణ పద్ధతులు వంటి ప్రమాణాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారని సిఈఓ తెలిపారు. ఎస్ఈసిఎ అవార్డు 2025లో పాల్గొనడం వలన రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా, మరిన్ని సంస్థలు ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రేరణ పొందుతాయని పేర్కొన్నారు.

అర్హత ఉన్న సంస్థలు ఎస్ సిఏ2025కు సంబంధించిన దరఖాస్తులను అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తు మార్గదర్శకాలు, ప్రమాణాలు, ఫార్మాట్లు అన్నీ ఈ వెబ్ పోర్టల్ (పోర్టల్ చిరునామా) అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ వచ్చే నెల 5వ తేదీ అని తెలిపారు. రాష్ట్ర ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు అన్ని రంగాలు చురుకుగా పాల్గొనాలని, ఈ ముఖ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని ఏపీ జెన్కో ఎండి, సిఈఓ నాగలక్ష్మి విజప్తి చేసారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870