బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) ఘోర విషాదానికి దారి తీసింది. వేలాది మంది అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఏర్పడిన హడావుడిలో ఆచూకీ కోల్పోయిన క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈ విషాద ఘటనపై తన గాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, ఈ ప్రమాదాన్ని హృదయ విదారకమని పేర్కొన్నారు. “బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ స్పందన
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుర్ఘటనపై క్రీడా, రాజకీయ రంగాలనుంచి అనేకమంది సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also : Erragadda Hospital : ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వం సీరియస్