Telugu News: Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. షెడ్యూల్ రిలీస్

Read Time:  1 min
Parliament Winter Session
Parliament Winter Session
FONT SIZE
GET APP

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు(Parliament Winter Session) ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మొత్తం 19 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.

Pramod Case: నా కొడుకును దారుణంగా హతమార్చారు.. రియాజ్ తల్లి

Parliament Winter Session
Parliament Winter Session

రాష్ట్రపతి ఆమోదం, మంత్రి ప్రకటన

ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ(Parliamentary) వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆమోదముద్ర వేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

“పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి, డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు” అని కిరణ్ రిజిజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.