📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 10, 2025 • 8:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఈరోజు ( సోమవారం )నుండి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు అమో దం, మణిపూర్‌ బడ్జెట్‌ ఆమోదం, అత్యంత కీలకమైన వక్ఫ్‌ (సవరణ) ను ఆమోదంపై ఈ సమావేశాల్లో కేంద్రం దృష్టి సారించనుంది. వక్ఫ్‌ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇప్పటికే నివేదిక అందజేసింది. దాన్ని వీలైనంత త్వరగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్‌ ఆమోదం కోరుతూ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మణిపూర్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు.

సమావేశాలు వాడివేడీగా సాగే అవకాశాలు

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు వాడివేడీగా సాగే అవకాశాలున్నాయి. వక్ఫ్‌ బిల్లుతో పాటు మణిపూర్‌ హింసాకాండ, లోక్‌సభ నియోజకవర్గాల పుర్వివభజన, అమెరికా సుంకాల పెంపు తదితరాలపై మోడీ సర్కారును గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు చేటు చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆయన ఆదివారం ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన పుర్వివభజనను, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు.

పుర్వివభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి

ఈ మేరకు రెండు తీర్మానాలను ఆమోదించారు. పుర్వివభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌ పార్టీల మద్దతు కూడగట్టాలని డీఎంకే నిర్ణయించింది. ఇక నకిలీ ఎలక్టోరల్‌ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్‌)లపై కేంద్రాన్ని నిలదీయాలని టీఎంసీ నిర్ణయించింది. దీనిపై కలిసి రావాలని కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్‌)లను కోరింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని కాంగ్రెస్‌ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లోనూ గళ మెత్తాలని పార్టీ నిర్ణయించింది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Parliament Parliament Sessions Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.