📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Parliament Session : నాలుగో రోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే.. ఉభయ సభలు వాయిదా

Author Icon By Sudha
Updated: July 24, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Session) నాలుగు రోజులపాటు పూర్తిగా అవరోధాలకు లోనయ్యాయి. ప్రతిపక్షం నిరసనలు, నినాదాలతో సభ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఫలితంగా ఏ చట్టాలపైనా చర్చ జరగకుండానే, సభలు వాయిదాపడుతూ (Postponed)సాగిన నాలుగో రోజు కూడా సమావేశాలు (Parliament Session) గందరగోళం మధ్య ముగిశాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు (Parliament Session)సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్‌సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. బీహార్‌ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్‌ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయితే మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష సభ్యుల నిరసనల మద్యే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

Parliament Session : నాలుగో రోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే.. ఉభయ సభలు వాయిదా

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

పార్లమెంట్ సమావేశాలు అంటే ఏమిటి?

భారత పార్లమెంటు ఉభయ సభలు తమ కార్యకలాపాలను నిర్వహించుకునే కాలాలను పార్లమెంటు సమావేశాలు అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి ప్రతి సభను ఆరు నెలలకు మించని వ్యవధిలో సమావేశపరిచే అధికారం ఉంది.

భారతదేశంలో సంవత్సరానికి ఎన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి?

భారతదేశానికి ఒక నిర్దిష్ట పార్లమెంటరీ క్యాలెండర్ లేదు. సంప్రదాయం ప్రకారం, పార్లమెంటు ఒక సంవత్సరంలో మూడు సమావేశాలకు సమావేశమవుతుంది. పొడవైన బడ్జెట్ సమావేశాలు జనవరి చివరిలో ప్రారంభమై ఏప్రిల్ చివరిలో లేదా మే మొదటి వారంలో ముగుస్తాయి.

పార్లమెంట్ సమావేశాల మధ్య వ్యవధి?

పార్లమెంటు రెండు సమావేశాల మధ్య గరిష్ట అంతరం ఆరు నెలల కంటే ఎక్కువ ఉండకూడదు . మరో మాటలో చెప్పాలంటే, పార్లమెంటు సంవత్సరానికి కనీసం రెండుసార్లు సమావేశం కావాలి. సాధారణంగా సంవత్సరంలో మూడు సమావేశాలు ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: National Sports Bill 2025: లోక్‌సభలో జాతీయ క్రీడా బిల్లు

Breaking News latest news Lok Sabha Monsoon Session No Debate Opposition Protest Parliament Session Rajya Sabha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.