📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Parliament sessions: రేపటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

Author Icon By Sharanya
Updated: July 20, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు (Parliament sessions) సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 21 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలు దేశ రాజకీయ వాతావరణాన్ని కదిలించే అవకాశముంది, ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాల నేపథ్యంలో.

ఇండీ కూటమి వ్యూహాలు సిద్ధం

ఈ సమావేశాల దిశగా వ్యూహరచన చేయడానికి ఇండీ కూటమి (Indie Alliance)నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలతో పాటు 10 పార్టీల నాయకులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. వీరి ప్రాథమిక లక్ష్యం – ఆపరేషన్ సిందూర్‌పై కేంద్రాన్ని ప్రశ్నించడం. కేంద్రం ఇప్పటికి ఆపరేషన్ వివరాలు బయటపెట్టలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బిహార్ ఓటర్ల జాబితాలో తలెత్తిన వివాదం, విదేశాంగ విధానాలపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందన

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం, “తాను అనేక యుద్ధాలు ఆపాడు, లేదంటే రెండు దేశాల మధ్య న్యూక్లియర్‌ వార్ జరిగేది”. అంతేకాదు, ఐదు ఫైటర్‌ జెట్స్‌ను తాము కూల్చేశామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ట్వీట్ చేశారు – “దేశ ప్రజలు ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతున్నారు.” ఇండీ కూటమి సమావేశానికి ఆప్ పార్టీ ఎంపీలు హాజరుకాలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం – “ఇండీ కూటమితో తమకు సంబంధం లేదు. వారు పార్లమెంట్‌లో మాత్రమే భాగస్వాములు.”

ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు

ఈ వర్షాకాల సమావేశాల్లో (Parliament sessions) కేంద్ర ప్రభుత్వం మొత్తం 15 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 8 కొత్త బిల్లులు కాగా, 7 పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా ముందుకు తేనున్నారు. నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ బిల్లు, జియోహెరిటేజ్‌ సైట్స్‌, జియో రెలిక్స్‌ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్‌ యాండీ డోపింగ్‌ (సవరణ) బిల్లు, మణిపూర్‌ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఇన్‌కం ట్యాక్స్‌-2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

జస్టిస్ యశ్వంత్ వర్మపై తీర్మానం

అలహాబాద్ హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.

భద్రత కట్టుదిట్టం – మాక్‌డ్రిల్ నిర్వహణ

వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. భద్రతా సంస్కరణలలో భాగంగా మాక్‌డ్రిల్ కూడా నిర్వహించారు .

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21, 2025 (సోమవారం) నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త బిల్లులు ఏవి?

  1. జియోహెరిటేజ్ సైట్స్, జియో రిలిక్స్ బిల్లు
  2. మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు
  3. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు
  4. నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు
  5. మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు
  6. ఇన్‌కం ట్యాక్స్-2025 బిల్లు
    మొత్తంగా 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Himachal Pradesh: ఒకే మహిళను పెళ్లాడిన ఇద్దరు అన్నదమ్ములు..వీడియో వైరల్

Breaking News INDI Alliance Strategy latest news Monsoon Session 2025 New Bills Parliament Operation Sindhoor Parliament Sessions 2025 Telugu News Trump Comments India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.