
కాంగ్రెస్(Congress)ఎంపీ రేణుకా చౌదరి గురించి ప్రత్యేక పరిచయ వాక్యలు అవసరం లేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆమె కాంగ్రెస్ ప్రైర్ బ్రాండ్ గా ఆమె పేరు. ప్రతిపక్షాల వారిని ఘాటుగా వ్యాఖ్యానించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. అలాంటి ఆమె ఇప్పుడు బీజేపీపై అదేవిధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు జరుగుతున్నాయి. అయితే పార్లమెంట్ పరిధిలో పెంపుడు కుక్కలను తీసుకురావడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్(Parliament Meetings) ఎంపీ రేణుకా చౌదరి మాత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి తన పెంపుడు కుక్కతో వచ్చారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది.
Read also: కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!

ఘాటుగా స్పందించిన రేణుకా చౌదరి
రేణుకా(Parliament Meetings) చౌదరి తీరుపై బీజేపీ ఎంపీ జగదాంబకా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నిబంధనల ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఎంపీలకు ఉన్న ప్రత్యేక హక్కులు దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారాలు నిబంధనలు ఉల్లంఘించడానికి కాదని వ్యాఖ్యానించారు. బీజేపీనేతలకు రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు. నిజమైన కుక్కలు ఎటువంటి హానీ చేయవని..కరిచే వ్యక్తులే పార్లమెంట్ లోపల ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా పెంపుడు కుక్క ఎలాంటి హాని చేయదని..తన కుక్క చాలా చిన్ద్న అని…ఇప్పటివరకు ఎవరినీ కరవలేదని పేర్కొన్నారు. బయట కుక్కలు ఏమి చేయవని లోపల ఉన్నవాళ్లే కాటు వేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: