📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

“పరీక్షా పే చర్చ” ఈసారి ప్రధానితో పాటు సెలబ్రిటీలు..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 6, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న “పరీక్షా పే చర్చ” ఈ ఏడాది కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. అయితే మోడీతో పాటు ఈసారి బాలీవుడ్‌ నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌, నటీనటులు దీపికా పదుకొణె, విక్రాంత్‌ మస్సే, భూమి పడ్నేకర్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌, పారా అథ్లెట్‌ అవని లేఖరా, రచయిత రుజుతా దివేకర్‌, ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలీ సబర్వాల్‌, ఫుడ్‌ ఫార్మర్‌ రేవంత్‌ హిమత్‌సింగ్కా, టెక్నికల్‌ గురూజీ గౌరవ్‌ చౌధరీ వంటి ప్రముఖుల పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్స్‌ను ప్రదర్శించనున్నారు. వీరు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపనున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే పరీక్షా పే చర్చ ఇప్పటికే ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో 8వ ఎడిషన్‌ జరగనుంది. అయితే ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలని అధికారులకు మోడీ సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖులను చర్చలో భాగం చేయనున్నారు. మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరినీ పీపీసీ కిట్స్‌ను కేంద్ర విద్యా శాఖ అందించనుందని సమాచారం. అలాగే.. లెజెండరీ ఎగ్జామ్‌ వారియర్స్‌గా ఎంపిక చేసిన 10 మందికి ప్రధాని నివాసం సందర్శించే అవకాశం కల్పించనున్నారు.

కాగా, పరీక్షా పే చర్చ కోసం గతేడాది డిసెంబర్‌ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. .జనవరి 24 ఉదయం 10గంటల వరకు వరకు దేశ వ్యాప్తంగా 9.72లక్షల మంది విద్యార్థులు, 1.01లక్షల మంది టీచర్లు, 24,289మంది తల్లిదండ్రులు రిజిస్టర్‌ అయినట్లు అధికారులు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈవెంట్‌లో పాల్గొనేందుకు 2500 మందిని ఎంపిక చేస్తారు. వారికి కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్‌లు అందిస్తారు. పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు https://innovateindia1.mygov.in/లో ఆన్‌లైన్ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్న(MCQ)లతో ఓ పోటీ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులు ప్రధానితో నేరుగా జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానమిస్తారు. విద్యార్థులకు తగిన సూచనలు చేస్తారు.

celebrities Deepika Padukone Google news Pariksha Pe Charcha PM Modi Sadguru Jaggi Vasudev

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.