📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

విజయ్ కి ప్రశాంత్ కిశోర్ కీలక సూచనలు

Author Icon By Anusha
Updated: March 1, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయ్ రాజకీయ ప్రయాణాన్ని విజయవంతం చేయాలంటే అన్నాడీఎంకేతో కూటమి అవసరమని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేను నిలువరించాలంటే, రాష్ట్రంలో శాశ్వత ఓటు బ్యాంకు ఉన్న అన్నాడీఎంకేతో కలిసి పనిచేయడం సముచితమని పీకే అభిప్రాయపడ్డారని సమాచారం. ఈ మేరకు అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి, విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించేలా రాజీ ఒప్పందం చేసుకోవాలని సూచించారని తెలుస్తోంది.

ప్రశాంత్ కిశోర్ సూచనలు

ఈ వ్యూహాన్ని అమలు చేస్తే, ప్రస్తుతం అన్నాడీఎంకేకు ఉన్న 25% ఓట్లు, టీవీకేకు 15-20% వరకు లభించే అవకాశముందని, ఇతర చిన్న పార్టీలు కలిసి వస్తే 50%కు పైగా ఓటింగ్ సాధ్యమవుతుందని విజయ్‌కు పీకే వివరించినట్టు సమాచారం.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠభరితంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను అధికారంలోకి తీసుకురావడానికి విజయ్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) సహాయాన్ని తీసుకుంటున్నారు. బీజేపీ, డీఎంకే రెండూ తనకు శత్రువులని విజయ్ ఇప్పటికే స్పష్టంగా వెల్లడించడంతో, ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే దానిపై పీకే కీలక సూచనలు చేసినట్టు సమాచారం.

ఏపీ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా పీకే విజయ్‌కు వివరించారని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు ఏపీలో ఘన విజయాన్ని సాధించారని.అదే తరహాలో అన్నాడీఎంకే-టీవీకే పొత్తు తమిళనాడులో విజయాన్ని అందించగలదని సూచించారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. సినీ ప్రపంచం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, విజయ్ మధ్య అనేక పోలికలు ఉన్నాయన్న ప్రశాంత్ కిశోర్, పవన్ కళ్యాణ్ మాదిరిగానే విజయ్ కూడా తమదైన రాజకీయ ముద్ర వేసుకోవచ్చని విశ్వసిస్తున్నట్టు సమాచారం.

పీకే సూచనలు, రాజకీయ ప్రస్తుత వాతావరణాన్ని బట్టి విజయ్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.తన అభిమానులను, కొత్త ఓటర్లను ఆకర్షించేలా టీవీకే ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

మాస్ లీడర్

అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం పళనిస్వామికి సీఎం పదవి, విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి కేటాయించేలా ఓ వ్యూహం సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, విజయ్‌ను ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఊహించలేమన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆయన పూర్తి స్థాయి మాస్ లీడర్, తమిళనాడులో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి.పీకే, ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌కు సమానంగా విజయ్‌ను చూస్తూ, ఆ స్ట్రాటజీని అమలు చేయాలని భావిస్తున్నారనేది ఓ అంచనా. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనే విషయం పవన్ కల్యాణ్ ఉదాహరణతో స్పష్టమవుతోందని, ప్రజాదరణ ఉన్నంత మాత్రాన రాజకీయ విజయం సాధ్యమా? అనే ప్రశ్నలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

#AIADMK #Elections2026 #MassLeaderVijay #PKStrategy #PoliticalStrategy #TamilNaduElections #telugu News #ThalapathyVijay #TNPolitics #VijayVsDMK Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news TVK VijayPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.