గత నాలుగు రోజులుగా పాకిస్తాన్ (Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పలు వదంతులు వినిపిస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను (Imran Khan) కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులకు 24 గంటల్లో అనుమతి ఇవ్వాలని తెలి హీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు ఎంపి ఫైసల్ జావేద్ డిమాండ్ చేశారు. పార్లమెంటు దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో ఆయన ఈ విధంగా ప్రకటన చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఎందుకు పూర్తిగా ఏకాంత నిర్బంధంలో ఉంచారు? అని ప్రశ్నించారు. ఆయనను కలిసేందుకు కుటుంబబానికి అనుమతి లేకపోవడంపై పీటీఐ ఎంపీ పైసల్ జావేద్ పార్లమెంటులో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.
Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ..ప్రభుత్వం ఏమంటుంది
పార్లమెంట్ లో గందరగోళం
దీనిపై పాక్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ వీఐపీ ఖైదీ అని, జైలు (prison) మాన్యువల్ ప్రకారం మాత్రమే ఆయనను కలవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఆక్ పార్లమెంట్ లో గందరగోళం తలెత్తింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు.
ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులను సైతం అనుమతి ఇవ్వక పోవడంతో ఆయనపై విషప్రయోగం చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం బాగుందని, ఆయనకు అన్ని సౌకర్యాలను అందిస్తున్నట్లు, క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటిస్తున్నా దీనిపై ప్రజలకు విశ్వాసం కలగడం లేదు. ఆయనకు ఏదో కీడు జరిగిందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులు అనుమానిస్తున్నారు. పార్లమెంటులో దీనిపై వాడివేడిగా చర్చలు జరగడంతో సభ రచ్చరచ్చగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: