సాయం చేయాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేయాలంటారు. ఆ మనసు లేకపోతే మౌనంగా ఉండమంటారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో శ్రీలంక దేశం అతలాకుతలమవుతుంటే ప్రపంచ దేశాలు తమవంతు సాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు శ్రీలంక అతలాకుతలమైపోయింది. లక్షల్లో ఇళ్లు కూలిపోయాయి. దీంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Read Also: America: తన ఆరోగ్యంపై ట్రంప్ ఎమన్నారంటే..?
ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ (Pakistan) శ్రీలంకకు ఆపన్నహస్తం అందించాలని అనుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పాకిస్తాన్ పంపిన ఆహారపదార్థాలు, మందులను అందుకున్న శ్రీలంక ప్రభుత్వం వాటిని చూసి అవాక్కైపోయింది. ఎక్స్పైర్ (గడువు ముగిసిన) ఆహార పదార్థాలను, మందులను పంపించింది. ఈ ఘటన పాకిస్తాన్ కు అంతర్జాతీయస్థాయిలో రాజకీయ, దౌత్యపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
2024 అక్టోబరుకే గడువు తీరింది..
శ్రీలంకకు (Sri Lanka) ‘మానవతా సహాయం’ పేరుతో పాకిస్తాన్ పంపిచ ప్యాక్ చేసిన పాలు, నీళ్లు, బిస్కెట్లు వంటివాటిపై అక్టోబరు 2024 అని స్పష్టంగా ముద్రించి ఉంది. అనేక కార్టన్ లలోని వస్తువుల గడువు తేదీలు ముగిసిపోయాయి. శ్రీలంక విపత్తు నిర్వహణ, విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆందోళనకు గురిచేసింది.
వైరల్ అయిన ఫోటోలు దీనికి సంబంధించిన ఫొటోలు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా యూజర్లు పాకిస్తాన్ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కనీసం పది కుటుంబాలకు కూడా సరిపోని పరిమాణంలో.. గడువు ముగిసిన ఆహారాన్ని పంపడం పట్ల మండిపడుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: