📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pakistan : జమ్ముకశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో మరోసారి పాక్ కాల్పులు

Author Icon By Divya Vani M
Updated: May 9, 2025 • 9:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.శుక్రవారం సాయంత్రం, జమ్ముకశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాకిస్థాన్ దళాలు నియంత్రణ రేఖను ఉల్లంఘించాయి.తేలికపాటి ఆయుధాలు, ఫిరంగులతో భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.ఈ కాల్పుల్లో భారత బంకర్లను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించారు.భారత బలగాలు సమర్థంగా ఎదురుదాడికి దిగాయి. యూరి సెక్టార్‌లో వాతావరణం క్షణాల్లో ఉద్రిక్తంగా మారిపోయింది.కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి విస్మరించినట్లు స్పష్టమైంది.గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తరచూ భారత భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. పరిణామాలపై నిశితంగా నిఘా కొనసాగుతోంది.భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.ఉత్తర, పశ్చిమ భారతంలో ఉన్న విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది.

మే 15 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.ఈ నిర్ణయం రాష్ట్రాల్లోని మొత్తం 24 విమానాశ్రయాలపై ప్రభావం చూపింది.ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి, అన్ని ఫ్లైట్లను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో గగనతల చొచ్చుకు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఈ చర్యలు ప్రజల భద్రత కోసం తీసుకున్నవేనని కేంద్రం స్పష్టం చేసింది.మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా విమానాలు నడుస్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో ఆరోగ్య రంగం అప్రమత్తమైంది.ఎయిమ్స్ వైద్యుల సెలవులను రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది.

అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించింది.ఇప్పటికే సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఆరోగ్య సమస్యలు తప్ప, ఎలాంటి సెలవు మంజూరు కాదని స్పష్టం చేసింది. కొత్త ఆదేశాలు వచ్చేవరకు ఈ నియమాలు అమల్లో ఉంటాయని తెలిపింది.రాష్ట్రాల్లో ఎయిమ్స్ వలెనే ఇతర వైద్య సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలున్నాయి. అత్యవసర వైద్యం కోసం సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. అయితే భారత్ అన్నివిధాలుగా సిద్ధంగా ఉంది. ప్రజల భద్రత మొదటి ప్రాధాన్యతగా చూస్తోంది కేంద్రం. పాక్ చర్యలకు తగిన ప్రతిస్పందన ఇచ్చేందుకు భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంది.

Read Also : Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం

AIIMS doctors leave cancelled Airports closed in North India Delhi AIIMS emergency update India Pakistan border tension Indian airspace security update Pakistan army firing news Uri sector ceasefire violation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.