పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ (Pakistan) తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు వచ్చాయి. మీడియాలో అంతా చాలా హడావుడి జరిగింది. జైలు లో ఉన్న ఆయన్ని కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని దీంతో ఆయన చనిపోయి ఉంటాడనే అనుమూనం వ్యక్తమయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా అని ఆయన కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్ ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలవడానికి అనుమతించడం లేదని అతడి సోదరీమణులు ఆరోపించారు.
ఆ వార్తల్లో నిజం లేదు
ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రావల్పిండి జైలు (prison) అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం అందిస్తున్నామని ప్రకటనను విడుదల చేశారు. అలాగే ఆడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను (Imran Khan) తరలించారంటూ వస్తున్న వార్తలో కూడా నిజం లేదని చెప్పారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. వైద్య సహాయం అందుతుంది. ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవి అని అన్నారు. వైద్య సహాయం అందుతుందని, ఆయన క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) కూడా దీనిపై స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లోనే క్షేమంగా ఉన్నారని, ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా లభించని మంచి ఆహారాన్ని అతడు పొందుతున్నారని చెప్పారు. జైల్లో ఆయనకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నాని మంత్రి ఆసిఫ్ పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై దాడి
ఇమ్రాన్ ఖాన్ ముగ్గరు సోదరీమణుల విషయంలో మరో రాద్దాంతం జరిగింది. తమపై అడియాలా జైలు బయట దాడి జరిగిందని ముగ్గురు చెల్లెళ్లు ఆరోపించారు. గత నెల రోజులుగా తాము తమ సోదరుడిని కలవడానికి ప్రయత్నిస్తున్నామని, తమపై పోలీసులు దాడి చేశారని చెప్పారు. తమ జట్టుపట్టుకుని రోడ్డుపైకి లాక్కెళ్లారని, కొట్టారని ఆరోపించారు. ఒకనెల రోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్ తో సమావేశాలపై అప్రకటిత నిషేధం విధించింది పాక్ సర్కార్.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :